వైసీపీలోకి లోకేష్ త‌మ్ముడు

491

ఏపీ రాజ‌కీయాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఎవ‌రు ఎవ‌రు బ‌రిలోకి దిగుతారు అనే విష‌యంలో అనేక వార్త‌లు ఇప్ప‌టికే వినిప‌స్తున్నాయి.. ముఖ్యంగా సినిమాన‌టులు చాలా మంది ఇప్పుడు వైసీపీ లో టీడీపీలో చేరేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీలో కీరోల్ పోషిస్తున్న మంత్రి లోకేష్ సోద‌రుడు అంటే ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కుమారుడు రాజ‌కీయాల్లోకి రానున్నార‌ట.. ఇదే వార్త ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో వైర‌ల్ అవుతోంది.

Image result for ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కుమారుడు

ఏపీ ప్ర‌కాశం జిల్లాలో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్త రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం అవుతోంది. ఎన్టీఆర్ కూతురు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి ప్ర‌స్తుతం బీజేపీలో కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు పురంధేశ్వ‌రి త‌న‌యుడు ద‌గ్గుబాటి హితేశ్ రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌నే వార్త రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మొద‌టి నుండి వ్య‌తిరేకంగా ఉన్న ద‌గ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో టీడీపీ నేతల్లో ఇక్క‌డ క‌ల‌వ‌రం మొద‌లైంది.

Image result for lokesh

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్ర‌బాబు, ఆ స‌మ‌యంలో త‌న వెన్నంటే ఉన్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌లో చేరిపోయారు. అయితే కొన్నాళ్ళుగా వెంక‌టేశ్వ‌ర‌రావు యాక్టీవ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. మ‌రో వైపు కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వెళ్ళిన పురంధేశ్వ‌రి ప‌రిస్థితి కూడా ఆశాజ‌న‌కంగా లేదు.. అలాగే ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ ఎదురీదుతోంది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ ద‌గ్గుబాటి ఫ్యామిలీ టీడీపీలో ఎలాగూ చేరే ప‌రిస్థితి లేదు.

ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీకే అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఈ క్ర‌మంలో ద‌గ్గుబాటి ఫ్యామిలీ వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ ముఖ్య నేత‌ల‌తో చ‌ర్చ‌లు పూర్తి అయ్యాయ‌ని, ఈ క్ర‌మంలో పురంధేశ్వ‌రి, వెంక‌టేశ్వ‌ర‌రావుల‌కు టిక్కెట్ల‌తో పాటు, ద‌గ్గుబాటి హితేశ్‌ను కూడా బ‌రిలోకి దించాల‌నే ప్ర‌తిపాద‌న‌ను వైసీపీ ముఖ్య‌నేత‌ల ముందు ఉంచ‌గా.. జ‌గ‌న్‌తో చ‌ర్చించిని త‌ర్వాత ద‌గ్గుబాటి వారి ప్ర‌తిపాద‌న‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. దీంతో హితేశ్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మ‌ని తెలుస్తోంది. దీంతో లోకేష్ లో ఎంతో సన్నిహితంగా ఉండే హితేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాదు అనుకొని వైసీపీకి వెళ‌తాను అని అన‌డం పై మంత్రి లోకేష్ కూడా షాక్ అయ్యార‌ట‌. మ‌రి ఈ నిర్ణ‌యం పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.