ఏపీ ప్ర‌జ‌ల‌కు లోకేష్ మ‌రో శుభ‌వార్త

514

తెలంగాణ పేరు చెబితే సైబ‌ర్ ట‌వ‌ర్స్ పేరు వినిపిస్తుంది… సైబ‌ర్ ట‌వ‌ర్ అన‌గానే చంద్ర‌బాబు పేరు గుర్తువ‌స్తుంది… నాటి సైబర్ ట‌వ‌ర్ నిర్మాణం ఐటీ కంపెనీల రాక‌కు సీఎం చంద్ర‌బాబు క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు అని.. కంపెనీల‌ను తీసుకురావ‌డం కంపెనీల‌ ఏర్పాటులో బాబు పాత్ర ఉంది అంటారు.. అయితే ఇప్పుడు అమరావ‌తి నిర్మాత ఏపీ ప్ర‌ధాత‌గా చంద్ర‌బాబును అంద‌రూ కీర్తిస్తున్నారు… అమ‌రావ‌తిని సింగ‌పూర్ అమెరికా లాంటి న‌గ‌రాల జాబితాలో తీర్చిదిద్చే విధంగా సీఎం చంద్ర‌బాబు ప్లాన్స్ ర‌చిస్తున్నారు.. కాస్త లేటు అయినా బాబు విజ‌న్ అదే.

Image result for lokesh

ఇక తాజాగా మంత్రి నారాలోకేష్ కూడా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సైబ‌రాబాద్‌లు నిర్మించాల‌నేది తమ విజ‌న్ అని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.ఏపీలో నిరుద్యోగుల‌కు ఉద్యోగాల క‌ల్ప‌నే థ్యేయంగా ముందుకు వెళుతున్న స‌ర్కార్ మాదే అని అన్నారు ఆయ‌న‌. ఇప్ప‌టికే అనేక కంపెనీలు ఏపీకి వ‌స్తున్నాయి అని ఆయ‌న తెలియ‌చేశారు.. తొంద‌ర్లో ఏపీ వైపు అమ‌రావ‌తిని క్యాపిట‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఏరియాగా అంద‌రూ గుర్తిస్తారు అని తెలియ‌చేశారు.

Related image

అమ‌రావ‌తిలో నేడు కొత్తగా ఏర్పాటైన 10 ఐటీ కంపెనీల సీఈవోలతో మంత్రి నారాలోకేష్ భేటీ అయ్యారు.ల‌క్ష ఐటీ ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ఐటీలో 36 వేలు, ఎలక్ట్రానిక్స్లో 20 వేల ఉద్యోగాలు కల్పించామని మంత్రి తెలిపారు. జియో ఫోన్ల తయారీ కోసం తిరుప‌తిలో 125 ఎక‌రాలు సేకరించామని సమావేశంలో పేర్కొన్నారు… విశాఖ, చిత్తూరు, అనంతపురం, గోదావరి జిల్లాల్లో ఐటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని పంచాయతీలకు ఫ్రీ వైఫై కన్షెక్షన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఎవ‌రెన్ని అడ్డంకులు సృష్టించినా ఏపీ అభివృద్దికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌తిప‌క్షానికి కౌంట‌ర్ ఇచ్చారు.