రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా -కేఈ

369

తెలుగుదేశం పార్టీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీనియ‌ర్లు పోటికి సుముఖ‌త చూపించ‌డం లేదు అనేది తెలిసిందే …వారి వార‌సుల‌ను రాజ‌కీయంగా ఎంట్రీ ఇప్పించాలి అని చూస్తున్నారు… ఇటు మంత్రులు, అయ్య‌న్న అలాగే కేఈ.. ఇక ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి కూడా ఆయ‌న త‌న‌యుడ్ని అనంత ఎంపీగా పోటీకి నిల‌బెట్ట‌నున్నారు. అయితే కేఈ తాజాగా ఓ రాజ‌కీయ విమ‌ర్శ చేశారు.. బీజేపీ ఏపీలో బ‌లంగా లేదు అన్నారు.. ఇక్క‌డ వ‌రకూ బాగానే ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ ఒక్క‌సీటు కూడా గెల‌వ‌దు గెలిస్తే తాను రాజకీయాల నుంచి త‌ప్పుకొంటాను అని అన్నారు.

Image result for కేఈ
ఇప్పుడు ఇదే విష‌యాన్ని అంద‌రూ ఆలోచిస్తున్నారు…వచ్చే ఎన్నిక‌ల్లో ప‌త్తికొండ నుంచి ఆయ‌న త‌న‌యుడు శ్యాంబాబు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డేందుకు స‌ర్వం సిద్దం చేసుకుంటున్నారు… త‌మ్ముడు ప్ర‌భాక‌ర్ ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు. ఇక వ‌య‌సు రిత్యా కేఈ కృష్ణ‌మూర్తి కూడా రాజ‌కీయాల‌కు సెల‌వు ప్ర‌క‌టించాలి అని అనుకుంటున్నారు.. ఈ విష‌యంలో అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.. ఎలాగో రాజ‌కీయాల నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు పోటీకే ఆయ‌న ఉండ‌రు.. ఇక మ‌ళ్లీ రాజ‌కీయాల నుంచి తప్పు కోవ‌డం ఏమిటి అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్యాంబాబు పోటీ చేయ‌రా అని మ‌రో మెలిక పెట్టారు ఈ వ్యాఖ్య‌ల‌తో కేఈ.

Image result for కేఈ
ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ పై కూడా ఆయ‌న చుర‌క‌లు అంటించారు.. స‌భ నుంచి బ‌య‌టకు రాజీనామాలు చేసి వ‌చ్చి బంద్ లు చేస్తూ ఉంటే, ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు అని అంటున్నారు. మొత్తానికి కే.ఈ ఫ్యామిలీ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్యాంబాబు నిల‌బ‌డ‌తారా లేదా అనేది ఓ ప్ర‌శ్న.. అయితే అస‌లు బీజేపీ ఒక్క‌సీటు కూడా గెల‌వ‌దు అని అన‌డం మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వార్త‌.. వెయిట్ అండ్ సీ చూడాలి ఈ రాజ‌కీయం ఎటువంటి మ‌లుపులు తిరుగుతుందో.