జ‌గ‌న్ కు ఈ పార్టీల స‌పోర్ట్ ఉంటుందా

421

2014 ఎన్నిక‌ల స‌మ‌యంతో టీడీపీకి త‌ర్వాత జ‌న‌సేన‌కు స‌పోర్ట్ గా ఉన్న వామ‌ప‌క్షాలు ఇప్పుడు మళ్లీ గేర్ మారుస్తున్నాయి అని తెలుస్తోంది… ఇక ప‌వ‌న్ వెంట ఉన్నారు అని అనుకుంటుంటే కొన్ని విష‌యాల‌లో ప‌వ‌న్ ఆలోచ‌న‌ల‌కు వీరి ఆచ‌ర‌ణ‌కు పొంతన లేకుండా ఉంట‌డంతో, ఎందుకు ప‌వ‌న్ తో అని మిత్ర బంధం పై ఆలోచ‌న చేస్తున్నారు.. అయితే తెలుగుదేశం పార్టీలో మ‌ళ్లీ పొత్తు ఏమైనా 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో పెట్టుకుంటారా అంటే అటువంటి ప‌రిస్దితి ప్ర‌స్తుతం క‌నిపించ‌డం లేదు.. ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ త‌ర్వాత ఆ రేంజ్ ప్ర‌చారం వైయ‌స్సార్ కాంగ్రెస్ కు వ‌చ్చేసింది..

Image result for cpi

ఇక జ‌న‌సేన పురుడు పోసుకుని స‌గం మంది యువ‌త‌ను ఆక‌ర్షించింది.. తెలుగుదేశం వైసీపీ జ‌న‌సేన ఈ త్రిముఖ పోటిలో వామ‌ప‌క్షాల స‌పోర్ట్ ఎవ‌రికి ఉంటుంది అనేది పెద్ద చ‌ర్చ‌గా ఉన్నా, వామ‌పక్షాలుఎ మాత్రం ఎవ‌రికి స‌పోర్ట్ చెయ్యాలి అనే ఆలోచ‌న మాత్రం ఇంకా తీసుకోలేదు.. అయితే నాడు వైయ‌స్ తో క‌లిసి ప‌ని చేసిన వామ‌ప‌క్షాలు… తండ్రి భావ‌జాలం ఉన్న‌ జ‌గ‌న్ తో క‌లిసి ప‌ని చేసే ఆస్కారం ఉంది అని అంటున్నారు సీనియ‌ర్లు. ఇక తెలుగుదేశం పార్టీని న‌మ్మే ప‌రిస్దితుల్లో కూడా లెఫ్ట్ పార్టీలు లేవు..

Image result for cpm

జ‌గ‌న్ చెప్పేవి ఆచ‌ర‌ణ సాధ్య‌మ‌య్యేవి అని అంటున్నారు కొంద‌రు లెఫ్ట్ పార్టీ నేత‌లు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మోదీతో స‌యోధ్య‌గా లేక‌పోయినా ఇటు బీజేపీ జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయా అనే ఆలోచ‌న కూడా వ‌స్తోంది.. ప‌వ‌న్ తో కొత్త ప్ర‌క‌ట‌న‌లు బీజేపీ ఇచ్చే అవ‌కాశం ఉంది.. ఇక వైసీపీ ఒంట‌రి పోరు అనేది తెలుస్తోంది …తెలుగుదేశం పొత్తుల కోసం కాంగ్రెస్ కు హ‌స్తం ఇస్తున్న విష‌యం తెల‌సిందే .మ‌రి లెఫ్ట్ పార్టీలు ఎవ‌రి వైపు ఉంటాయో చూడాలి.