Breaking News: కాంగ్రెస్ సీనియ‌ర్ మృతి విషాదంలో లీడ‌ర్స్

356

వ‌రంగ‌ల్ జిల్లాలోని మండలకేంద్రం శాయంపేట కాంగ్రెస్‌ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, సీనియర్ నేత వినుకొండ శ్రీనివాస్‌ అనారోగ్యంతో హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు… ఆయ‌న వ‌య‌సు 50 సంవ‌త్స‌రాలు ఇక ఆయన గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే కుటుంబ‌ సభ్యులు ఆయా ఆసుపత్రుల్లో చికిత్స నిర్వహింపజేసినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన బుధ‌వారం మృతిచెందారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శ్రీనివాస్‌ మృతితో శాయంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్‌ భౌతికకాయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంటరమణారెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మెతుకు తిరుపతి రెడ్డి, నాయకులు రాంశెట్టి లక్ష్మారెడ్డి, ఆకుతోట సమ్మిరెడ్డి, గట్ల విజయపాల్‌ రెడ్డి, లెక్కల ప్రకాశ్‌రెడ్డి, జిన్నా ప్రతాప్ సేనారెడ్డి, మారెపల్లి నందం, మోహన్‌, కొంరయ్య తదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు…. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. పార్టీ త‌ర‌పున సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్నారు.. అయితే ఆయ‌న మృతిలో క్రిందిస్ధాయి కేడ‌ర్ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.. పార్టీలో కీల‌క నేత‌గా ఉన్న ఆయ‌న ఏ స‌మ‌స్య వ‌చ్చినా తీర్చేవారు అని, ఇక్క‌డ స్ధానికులు క‌న్నీరు పెట్టుకుంటున్నారు… ఇప్పుడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు.