తెలంగాణ గవర్నర్ తమిళిసై కేసీఆర్ తో డీ కొట్టబోతున్నారా ?

573

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఢీ కొట్టబోతున్నారా? ఇన్నాళ్లు ఆడింది ఆట, పాడింది పాటగా నడిచిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు తమిళిసై తలనొప్పిగా మారనున్నారా? తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకుంటున్న తమిళిసై ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత నుండి దూకుడు పెంచారు. అటు అధికారులను, ఇటు మంత్రిని ఆర్టీసీ సమ్మె గురించి ఆరా తీస్తూ చెమటలు పట్టిస్తున్నారు. గతంలో గవర్నర్ నరసింహన్ పాలనకు సంబంధించిన వ్యవహారం అయినా.. రాష్ట్రంలో జరిగిన ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు అయినా… ఏ విషయమైనా సీఎం కేసీఆర్ తో మాత్రమే చర్చించేవారు. ఇక ప్రస్తుతం తమిళిసై అందుకు భిన్నంగా అధికారులను, మంత్రులను పరుగులు పెట్టించడం గమనార్హం.

గవర్నర్ జోక్యంతో ఆర్టీసీ కార్మికులకు మేలు జరుగుతుందన్న భావన

ఆర్టీసీ సమ్మెలో గవర్నర్ జోక్యం చేసుకోవడం వల్ల ఆర్టీసీ కార్మికులకు మేలు జరుగుతుంది అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ సైతం గవర్నర్ వేస్తున్న అడుగులను చాలా జాగ్రత్తగా గమనిస్తునట్లుగా తెలుస్తుంది. ఇక అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర పరిస్థితులు చెప్పిన తమిళిసై కి కేంద్ర అధినాయకత్వం దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే ఆమె ఆర్టీసీ సమ్మె విషయంలో దృష్టి సారించారు. ఇక ఇదే సమయంలో నిన్న జెఎసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ… సమ్మె విషయంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే రాజ్యాంగ సంక్షోభం కూడా రావచ్చని వ్యాఖ్యానించడం తమిళిసై వేస్తున్న అడుగుల నేపథ్యంలోనే అని అర్థమవుతుంది. మొన్న తమిళిసై ని కలిసి ఆర్టీసీ కార్మిక జేఏసీ తమ గోడు చెప్పుకున్న నేపధ్యంలో ఆమె చొరవ తీసుకుంటారనే భావన కలిగిన జేఏసీ నాయకులు ప్రస్తుతం ఆమె మాత్రమే ఈ సమస్య పరిష్కరించగలదు అన్న నమ్మకంలో ఉన్నారు. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ సైతం, టిఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేయడానికి ఆర్టీసీ సమ్మెను, ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సంకోచంలో పడ్డారు.

ఈ క్రింద వీడియో చూడండి

గవర్నర్ తీరు షాక్ కి గురి అవుతున్నారు. చర్చలకు వెళ్లకుంటే కార్మికులు సమ్మెను కొనసాగిస్తారు. ఆర్టీసీ సమ్మెకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్న నేపద్యంలో సమ్మె ఉధృతమవుతుంది. సమ్మె కొనసాగితే ప్రభుత్వ మనుగడకు విఘాతం కలిగిస్తుంది. ఒకవేళ చర్చలకు వెళితే ఆర్టీసీ కార్మికుల ముందు ప్రభుత్వం మెట్టు దిగినట్టు అవుతుంది. ఇక ఇదే తరహా ఉద్యమాలు ప్రతి శాఖలో కొనసాగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకొని, గవర్నర్ వేస్తున్న అడుగులను అంచనా వేసుకుంటూ సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత గవర్నర్ తమిళిసై వ్యవహార శైలిలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ తో ఢీ కొట్టడానికి గవర్నర్ రెడీ అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి తమిళసై, కెసిఆర్ డీ పడితే ఏం జరుగుతుందో.. మరి ఈ విషయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి