కేసీఆర్ కు మ‌రో షాకిచ్చిన ఆర్టీసీ ఉద్యోగులు

342

హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన భవన్‌లో ఆర్టీసీ జేఏసీ నేతలు రాజకీయ పార్టీల మధ్య జరిగిన భేటీ ముగిసింది. భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఆర్టీసీ కుటుంబాలతో బైఠాయింపు ఉంటుందన్నారు. 22వ తేదీన తాత్కాళిక డ్రైవర్లు,కండక్టర్లకు ఆర్టీసీ కార్మికుల పొట్టకొట్టవద్దని విజ్ఞప్తి చేస్తామన్నారు. రూ.1000,రూ.1500కి ఆశపడి తాత్కాళికంగా విధులు నిర్వహిస్తున్నవారు.. 22వ తేదీ నుంచి విధులకు దూరంగా ఉండాలన్నారు. ప్రజా రవాణాను ప్రైవైటీకరించకుండా తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలన్నారు. అలాగే 23వ తేదీన ప్రజా ప్రతినిధులతో ములాఖత్ ఉంటుందని తెలిపారు. 24వ తేదీన మహిళా కండక్టర్లంతా ఆర్టీసీ డిపోల ఎదుట దీక్షలు చేపడుతారని చెప్పారు. 25వ తేదీన హైవేలపై బైఠాయించి దిగ్భంధం చేస్తామన్నారు. 26వ తేదీన ఆర్టీసీ కుటుంబాల పిల్లలతో దీక్షలు చేపడుతామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆర్టీసీ పోరాటాన్ని ఆపేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

Image result for trs samme

ఇదిలా ఉంటే,ఆర్టీసీ డిమాండ్ల కోసం ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మబలిదానం చేసుకోగా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఖాజామియా అనే ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. 15 రోజుల నుంచి ఆయన ఆర్టీసీ సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఓవైపు ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చుతున్నా.. ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు. సీఎం కేసీఆర్ ఇకనైనా మొండివైఖరి వీడి ఆర్టీసీతో చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ నేతలు,ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు సూచనలను సైతం బేఖాతరు చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సబబు కాదని గుర్తుచేస్తున్నారు.అలాగే రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలను కలవాలని నిర్ణయించారు. అలాగే, తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలను కూడా కలిసి ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలకాలని కోరనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, వేతనం రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామనే విషయాన్ని కూడా వారు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. టీఆర్ఎస్ మిత్రపార్టీ లాంటి ఎంఐఎంను కూడా తమ సమ్మెకు మద్దతు పలకాలని కోరనున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లేదా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కలసి మద్దతు కోరాలని జేఏసీ నిర్ణయించింది. ఈనెల 23న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది.

ఈ క్రింద వీడియో చూడండి

దీంతోపాటు బంద్‌లో పాల్గొని తీవ్రంగా గాయపడిన సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావును జేఏసీ నేతలు పరామర్శించనున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరసనకు దిగిన సీపీఐఎంఎల్ నేత రంగారావును అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులోకి ఎక్కించారు. ఈ క్రమంలో.. తన వేలును తలుపుల మధ్య పెట్టి గట్టిగా నొక్కేశారని రంగారావు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యకు ఆయన బొటనవేలు తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది.

ఈ క్రింద వీడియో చూడండి