వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

104

పోలీసులపై రాజకీయ నేతలు వారి కుమారులు దౌర్జాన్యానికి దిగడం ఇటీవల చాలా ఎక్కువగా జరుగుతోంది.. కొందరు నేతలు అధికారంలో ఉండటంతో ప్రభుత్వం తమదే అనే రీతిన పోలీసుల పనులకు అడ్డుతగులున్నారు.. విధి నిర్వహణలో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళతారు కాని కొందరు వారి పనులకు ఆటంకం కలిగిస్తారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది
వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు వెంకటకృష్ణ ప్రసాద్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్‌పై ఐపీసీ 323, 353 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు ఆయనను రిమాండ్‌కు తరలించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులపై ప్రసాద్ దాడికి పాల్పడ్డారు. ప్రసాద్‌ను అరెస్ట్‌ చేయడంపై ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌తో చెప్పి సస్పెండ్‌ చేయిస్తానంటూ ట్రాఫిక్ పోలీసులకు ఎమ్మెల్యే ఉదయభాను కుటుంబ సభ్యులు వార్నింగ్ కూడా ఇచ్చారు.

విధి నిర్వహణలో ఉన్న మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌పై ప్రసాద్‌ దౌర్జన్యానికి దిగారు. దీంతో వెంకటకృష్ణ ప్రసాద్‌ను మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్‌లోని ఖానామేట్‌ మీనాక్షిటవర్స్‌ వద్ద సోమవారం రాత్రి 9గంటల సమయంలో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నప్పుడు నోవాటెల్‌ హోటల్‌ నుంచి మీనాక్షిటవర్స్‌ వైపు అతివేగంగా వెంకటకృష్ణప్రసాద్‌ రాంగ్‌రూట్‌లో వెళ్తున్నాడు. గమనించిన కానిస్టేబుల్‌, ఇన్‌స్పెక్టర్‌ కారును ఆపారు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటకృష్ణప్రసాద్‌ కానిస్టేబుల్‌, ఇన్‌స్పెక్టర్‌ను దుర్భషలాడుతూ ఇన్‌స్పెక్టర్‌ కాలుపై తన్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్థానికులు కృష్ణప్రసాద్‌ను అడ్డుకున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే సతీమణి పోలీసుల్ని బెదిరిస్తున్న వీడియో బయటపడింది. కేసీఆర్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తానంటూ ఆమె ట్రాఫిక్‌ సిబ్బందిని హెచ్చరించారు. ఉదయభాను కుమారుడు ప్రసాద్ పోలీసులపై దాడి చేశాక.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే సతీమణి మిమలాభాను, కుమారుడు ప్రసాద్, కుమార్తె ప్రియాంక, అల్లుడు విజయసాయి అక్కడే కారులో ఉన్నారట. వెంటనే ఉదయభాను భార్య, కుమార్తె, అల్లుడు అక్కడికి వచ్చి ట్రాఫిక్ సిబ్బందితో గొడవకు దిగారు.

Image result for jagan
ఉదయభాను సతీమణి.. ఆడవాళ్ల మీద చేయి చేసుకున్నావని.. కేసీఆర్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తానంటూ పోలీసుల్ని హెచ్చరించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో.. అక్కడే ఉన్న స్థానికులు తిరగబడ్డారు. ట్రాఫిక్ సిబ్బందిని ఎందుకు తిడుతున్నారంటూ వారిని ప్రశ్నించారు. ఈ సీన్ మొత్తాన్ని కొందరు మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బయటపడింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.