కోర్టులో లొంగిపోయిన కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌యుడు కోడెల శివరాం

342

మాజీ స్పీకర్..దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మ‌హ‌త్య త‌ర్వాత, ఆయ‌న కుటుంబాన్ని టార్గెట్ చేశారు అని వైసీపీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేశారు టీడీపీ నేత‌లు. ఈ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం వైయ‌స్ జ‌గ‌న్ అని విమ‌ర్శించారు. తాజాగా టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం నర్సరావుపేట కోర్టులో లొంగిపోయారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన అనేక అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. వీటి మీద తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శివరాం గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే..ఈ కేసుల విషయంలో స్థానిక కోర్టును ఆశ్రయించాలని..అక్కడ బెయిల్ కు అభ్యర్ధన చేయాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు శివరాం కోర్టులో లొంగిపోయారు.

Image result for kodela sivaram

ఆయనకు ఆరు కేసుల్లో బెయిల్ లభించింది. ఇక, కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య కేసులో విచారణ కోసం హాజరు కావాల్సిందాగా ఆయన పిల్లలిద్దరికీ పోలీసులు సమాచారం ఇచ్చారు. 11వ రోజు కార్యక్రమం ముగిసిన తరువాత తము వస్తామని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యవహారంలోనూ శివరాం హైదరాబాద్ పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. కుమార్తె కుమారుడు ఇద్ద‌రూ కూడా విచార‌ణ‌కు హైద‌రాబాద్ పోలీసుల ముందు వెళ్లాల్సిందే.

Image result for kodela sivaram

గ‌తంలో తండ్రి అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అనేక అక్ర‌మాలు చేశార‌ని, కే టాక్స్ పేరుతో ఉద్యోగాలు..కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ చాలామంది ద‌గ్గ‌ర ఆయన డబ్బులు వసూలు చేసి మోసం చేసారని అనేక కేసులు నమోదయ్యాయి.
తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని గడ్డి వ్యవహారం మొదలు ఆస్పత్రుల్లో మందుల వరకూ అదే విధంగా రైల్వే కాంట్రాక్టర్ల మొదలు చిన్న స్థాయి వ్యాపారుల వరకు అనేక అంశాల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేసారనే ఫిర్యాదులు నమొదయ్యాయి. ఇక..అనేక మందికి ఉద్యోగాల పేరుతోనూ.. కాంట్రాక్టుల పేరుతోనూ డబ్బులు స్వీకరించారు. అదే విధంగా ఒక ప్రభుత్వ శాఖలోని కంప్యూటర్లను సైతం దుర్వినియోగం చేసారనే అభియోగం ఉంది.దీని పైన అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కోడెల పిల్ల‌లు హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన కోర్టు సైతం స్పష్టమైన సూచనలు చేసింది. కేసులు నమోదైన జ్యూరిస్డిక్షన్ కోర్టుకు హాజరై..అక్కడే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఈ క్రింద వీడియో చూడండి

దీంతో కోడెల మరణానికి మందు కెన్యా వెళ్లిపోయిన శివరాం..తండ్రి మరణం తో తిరిగి వచ్చారు. ఇప్పుడు తండ్రి 11వ రోజు కార్యక్రమాలు కూడా ముగియటంతో ఆయన ఈ రోజు నర్సరావు పేట కోర్టులో హాజరయ్యారు. ఆయన మీద నమోదైన వాటిల్లో ఆరు కేసుల్లో శివరాంకు బెయిల్ లభించింది. కేసుల్లో విచారణ కొనసాగనుంది. దీని ద్వారా మిగిలిన కేసుల విషయంలోనూ న్యాయ పరంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక కోడెల మ‌ర‌ణించిన స‌మ‌యంలో ఆయ‌న సెల్ ఫోన్ దొర‌క‌లేదు. దీనిపై కూడా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. అందులో ఏమైనా స‌మాచారం ఉందా అని పోలీసులు తెలుసుకుంటున్నారు. మొత్తానికి ఈ వారం హైద‌రాబాద్ లో పోలీసుల ముందు విచార‌ణ‌కు కూడా హ‌జ‌రుకావాల్సిందే లేక‌పోతే అక్క‌డ నుంచి కూడా నోటీసులు వ‌చ్చే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.