Breaking News- పవన్ కళ్యాణ్కు తీవ్ర అనారోగ్యం సర్జరీ

896

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ నుంచి పొలిటికల్ స్టార్ అయ్యారు, అయితే సినిమాలు వదిలేసి చాలా కాలం అయినా, ఆ సినిమాల సమయంలో అయిన గాయాలు మాత్రం ఆయనని ఇంకా వదల్లేదు. అవును జనసేన అధినేత పవన్ కళ్యాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జనసేనాని స్వయంగా ధ్రువీకరించారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నునొప్పి సమస్య తలెత్తింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది కొంచెం పెరిగింది. అయితే, పవన్ కళ్యాణ్ అశ్రద్ధ చేయడంతో మళ్లీ వెన్నునొప్పి బాధించడం మొదలు పెట్టింది.

Image result for pawan kalyan health condition

దీంతో గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ బయట కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొనాల్సిందిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ను ఆహ్వానించింది. ఆ సమావేశానికి తాను హాజరుకాలేనంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరఫున, నా తరఫున వ్యక్తిగతంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపూసకు గాయమైంది. అప్పటి నుంచి అది వేధిస్తోంది.

Image result for pawan kalyan health condition

ఇటీవల ఎన్నికల ప్రచారంలో అశ్రద్ధ చేయడం వల్ల అది మరింత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం మీద నమ్మకంతో ఆ దిశగా ముందుకు వెళ్తున్నా. గత కొన్ని రోజులుగా మళ్లీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మీరు నిర్వహించే సమావేశానికి జనసేన తరఫున ప్రతినిధులు మీడియా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు.’ అని పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో చెప్పారు. ఇటీవల సైరా నరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి సోదరుడు, జనసేన అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరై సందడి చేశారు. సైరా వేదికపై ఆయన ప్రసంగిస్తుంటే.. మెగా అభిమానుల ఈలలతో సభా ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. పవన్ ప్రసంగం రసవత్తరంగా సాగింది.

ఈ క్రింద వీడియో చూడండి

తన అన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా కావడం ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీ బిగ్ ఈవెంట్ ప్లాన్ చేయడంతో పవన్ కల్యాణ్ ఈ ఫంక్షన్ కు హరయ్యారు. పవన్ కు అనారోగ్యం అని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలో ఉన్నారు, పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.