తెలంగాణ‌లో మ‌రో విషాదం మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కన్నుమూత

211

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో వ‌రుస షాక్ లు త‌గులుతున్నాయ‌నే చెప్పాలి.. నిన్న జైపాల్ రెడ్డి మ‌ర‌ణంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ శ్రేణులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. ఇప్పుడు ఆస్ప‌త్రిలో చికిత్స్ పొందుతున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు.దీంతో ఇది కాంగ్రెస్ పార్టీకి తీర‌ని వేద‌న అనే చెప్పాలి. . ముఖేష్ గౌడ్ వయసు 60 సంవత్సరాలు. 1959 జూలై 1న జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో మార్కెంటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ నేత దేవేందర్ గౌడ్‌కు ఆయన సమీప బంధువు. మహారాజ్ గంజ్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేష్ గౌడ్, ఓసారి గోషా మహల్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఓడిపోయారు. 2014, 2018లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్‌కు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Image result for ముఖేశ్ గౌడ్

ముఖేష్ గౌడ్ ఏడు నెలలుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.. డాక్టర్లు పలు సర్జరీలు చేశారు.. వైద్యం కూడా అందిస్తున్నారు.కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన సమయంలోనే ఆయన పూర్తిగా చిక్కిక‌నిపించారు.మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించారు.

ఈ క్రింద వీడియోని చూడండి

యూత్ కాంగ్రెస్ నేతగా ముఖేష్ గౌడ్ రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండు రోజుల్లో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు చనిపోవడంతో తెలంగాణలో హస్తం పార్టీ శ్రేణులు దుఃఖంలో మునిగిపోయాయి. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే ముఖేష్ గౌడ్ చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. నిజంగా ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వ‌రుస విషాదం అనే చెప్పాలి. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుందాం.