తీహార్ జైల్లో చిదంబరంకు ఏ ఆహారం పెడుతున్నారో తెలుసా

490

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మాజీ కేంద్రమంత్రి చిదంబరంను తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నెల 19 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం గతంలో ఉన్న నంబర్ ఏడు జైల్లోనే ఆయన్ను ఉంచారు. తనకు ప్రత్యేక గది,బాత్‌రూమ్, జడ్ కేటగిరి భద్రతా సదుపాయాలు కల్పించాలన్న చిదంబరం చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దీంతో జైల్లో చిదంబరం నిద్రలేని రాత్రులను గడుపుతున్నాడు.. ప్రతి రోజు స్వల్ప ఆహారం తీసుకుంటున్నారు.. బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా చిదంబరంకు జైలు సిబ్బంది టీ, బ్రెడ్, పోహ, ఓట్ మీల్ అందిస్తున్నారు. తన జైలు గది బయట నడిచేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మిగతా ఖైదీల్లాగే చిదంబరం కూడా తీహార్ జైల్లోని లైబ్రరీకి వెళ్లేందుకు, అక్కడ టీవీ చూసేందుకు అనుమతినిచ్చారు. అలాగే ప్రతీరోజూ ఆయన సెల్‌ కు వార్తా పత్రికను కూడా పంపించనున్నారు. సెల్‌లో పడుకునేందుకు ఒక బ్లాంకెట్, తల కింద పెట్టుకునేందుకు మెత్త ఇచ్చారు. చిదంబరం జైల్లో ఇచ్చే నీటిని తాగవచ్చునని లేదా క్యాంటీన్ నుంచి వాటర్ బాటిల్స్ కొనుక్కోవచ్చునని అధికారి ఒకరు తెలిపారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇప్పటికే జైలు శిక్ష నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న చిదంబరానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇంటి భోజనానికి అనుమతివ్వాలని చిదంబరం కోర్ట్ కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అందరికి ఇచ్చే ఆహారాన్నే ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. చిదంబరం రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సెప్టెంబర్-12 న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. చిదంబరానికి ఇంటి నుంచి వండి తెచ్చిన ఆహారాన్ని అందించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన తరపు లాయర్ కపిల్ సిబల్ కోరగా జస్టిస్ సురేష్ కుమార్ కైత్ తిరస్కరించారు. అయితే చట్టం ముందు అందరూ సమానమే అని.. తీహార్ జైల్లో అందరికీ ఎలాంటి ఆహారం అందిస్తారో, అదే ఆహారాన్ని చిదరంబరానికి అందిస్తారని కోర్టు స్పష్టంచేసింది. కోర్టు వ్యాఖ్యలపై కలగజేసుకున్న కపిల్ సిబల్, చిదంబరానికి 74 ఏళ్లని, ఆయన విజ్ఞప్తిని పరిశీలించాలని మరోసారి కోరారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ఐఎన్‌ఎల్డీ నాయకుడు ఓం ప్రకాశ్ చౌతాలా ఇంతకన్నా పెద్దవయస్సు వారైనప్పటికి రాజకీయ ఖైదీగా ఉన్నారన్నారు. తోటి ఖైదీలకు పెట్టే భోజనాన్నే ఆయనా తింటున్నారని తెలిపారు.

Image result for చిదంబరం

తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టులో ‘ ఈ ఫుడ్ ‘ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. తన క్లయింటుకు సంబంధించి ఆయన నేరాలకు పరిమిత కాల జైలుశిక్ష మాత్రమే సరిపోతుందని, ఐపీసీ లోని సెక్షన్ 420 ఆయనకు వర్తించదని కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన తుషార్ మెహతా.. కేసు ఇప్పుడు ప్రీ-చార్జిషీటు దశలోనే ఉందని చెప్పారు. పిటిషనర్ ని ఆగస్టు 21 న అరెస్టు చేశారు. 2007 లో ఆయన అవినీతితో సహా పలు నేరాలకు పాల్పడ్డారు అని మెహతా అన్నారు. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని, 14 రోజులపాటు తనను జ్యూడిషియల్ కస్టడీకి పంపాలన్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ చిదంబరం రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. చూడాలి మరి చిదంబరం కేసు చివరికి ఏమవుతుందో.. మరి చిదంబరం ఫుడ్ విషయంలో కోర్ట్ అనుమతిని ఇవ్వకపోవడం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.