చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయం జగన్ సంచలన నిర్ణయం

150

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మొట్టమొదటి సారిగా అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరమే గత ప్రభుత్వం వారు చేసిన అవినీతి అక్రమాలను మాత్రం సహించేది లేదు అని వారు చేసిన ప్రతీ ఒక్క అవినీతిని ఏయే అంశాల్లో చేసారో అవన్నీ బయట పెడతామని జగన్ సెలవిచ్చారు.అందులో భాగంగా ఆయా శాఖలకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని కొన్ని కమిటీలను కూడా జగన్ నియమించిన సంగతి అందరికి తెలిసిందే.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అనేక అవినీతి అక్రమాల పై విచారణ జరిపిస్తామని అలాగే వారు ఆమోదించిన ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని అలాగే పనులు జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ జరిపిస్తామని అంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ముఖ్యంగా అయితే వీరు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని అప్పటి మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.అయితే ఇప్పుడు ఉమ మరియు చంద్రబాబు విషయంలో జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక వార్త సంచలనంగా మారింది.అందులో భాగంగానే ఆ పార్టీ కీలక నేత అయినటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడొక సంచలన ట్వీట్ పెట్టారు.

Image result for chandrababu

ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం. మీలాగా కుల, వర్గ బలహీనతలు సీఎం జగన్ గారికి లేవు. చూస్తారుగా తొందరెందుకు?” అని సూటిగా చంద్రబాబును టార్గెట్ చేసేసారు.గత కొన్ని రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో జగన్ అధికారంలోకి కనుక వస్తే చంద్రబాబు జైలుకు పోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు.ఇప్పుడు నిజంగానే జగన్ అలా చేస్తున్నారా అన్న సంకేతాలు ఇప్పుడు వస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే సీఎం మంత్రులు తీసుకున్న నిర్ణయా ప్రకారం మాత్రమే అధికారులు పనులుచేస్తారు ఈ విషయంలో అధికారులు కూడా ఎలాంటి అవకతవరలకు పాల్పడకపోతే మంచిదే అని చెబుతున్నారు. ఒపక్క ఇలా జగన్ సర్కారు గత పాలకుల పై విమర్శలు చేస్తుంటే మరో పక్క తెలుగుదేశం నేతలు మాత్రం ఇందులో ఎలాంటి మోసం లేదని తాము సక్రమంగా అన్నిపనులు చేశాము అంటున్నారు, కేవలం చంద్రబాబుని లోకేష్ ని ఇరుకున పెట్టాలనే ఉధ్దేశ్యంతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని తెలుగుదేశం నేతలు తిరిగి కౌంటర్ ఇస్తున్నారు, మొత్తానికి ఈ అవినీతి విమర్శల కథ ఎక్కడ వరకూ వెళుతుందో చూడాలి.