వాజ్ పేయ్ కి అంత్య క్రియలు ఎవరు చేసారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

522

మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పెయి తిరిగిరాని లోకానికి వెళ్లారు.. ఆయ‌న మ‌ర‌ణంతో అఖండ భార‌తావణి దుఃఖంతో శోకించింది..ఓ క‌వి , ఓ రాజ‌కీయ యోధుడు, ఓ చ‌లోక్తుడ్నిఈ భార‌తావ‌ని కోల్పోయింది.. ఆయ‌న అంతిమ‌సంస్కారాల‌ను ప్ర‌భుత్వం పూర్తి చేసింది ..అట‌ల్ జీ అకాల మ‌ర‌ణంతో విదేశాల నుంచి ఆయ‌న‌కు ఉన్న అత్యంత ఆప్తులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అయ్యారు.. భార‌తమాత ముద్దు బిడ్డ అట‌ల్ జీ యుమునా నదీ తీరంలో శాశ్వతంగా సేద తీరడానికి త‌ర‌లివెళ్లిపోయారు.

Image result for atal bihari vajpayee

ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అటల్‌జీ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అటల్‌ దత్తపుత్రిక నమిత.. ఆయన చితికి నిప్పంటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు ఆయ‌న కుటుంబ స‌భ్యులు… అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, త్రివిధ దళాధిపతులు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, సీనియర్‌ నేతలు అద్వానీ సహా పలువురు ఆ మహానేతకు తుది నివాళి అర్పించారు..

అసమాన దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమైన అటల్ బిహారీ వాజ్‌పేయి.. అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తూ ఈ లోకం నుంచి శాశ్వతంగా తరలిపోయారు. మురికి కూపంలా మారిన రాజకీయాల్లో వికసించిన కమలం అనంతలోకాలకు వెళ్లిపోయారు.వాజపేయికి లక్షలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు…విజయ ఘాట్ పక్కన 1.5ఎకరాల్లో వాజపేయి మెమోరియల్‌ను ఏర్పాటు చేయనున్నారు..వాజపేయి పార్థీవ దేహంపై కప్పివుంచిన త్రివర్ణ పతాకాన్ని ఆయన మనవరాలు నిహారికకు అందజేశారు.. ఆ స‌మ‌యంలో ఆమె క‌న్నీరు మున్నీరు అయ్యారు ఆమె విషాద‌వ‌ద‌నంతో అక్క‌డ నుంచి ముందుకు క‌దిలారు… ఆయ‌న‌కు వార‌సులు లేక‌పోయినా ఆయ‌న ద‌త్త‌పుత్రిక ఆయ‌న అంతిమ సంస్కారాలు అన్నీ పూర్తి చేయ‌డంతో, దేశ ప్ర‌జ‌లు ఆమెకు ఎంతో అదృష్టం ద‌క్కింది అని భావిస్తున్నారు… ఏది ఏమైనా ఈరోజు భ‌ర‌త‌మాత ఒడిలో ఓ మ‌హాయోధుడు పుడ‌మిలో భాగ‌మైపోయాడు. ఆయ‌న మిగిల్చిన గుర్తులే ఇక అంద‌రి మ‌దిలో చిర‌స్దాయిగా గుర్తు ఉంటాయి.