ఎంపీ కల్వకుంట్ల కవిత తాజా కామెంట్స్

260

ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో ముందంజలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌, ఇతర పార్టీల్లాగా తెరాస ఎలాంటి మోసానికి పాల్పడలేదు. గత నాలుగేళ్లలో తెరాస ప్రభుత్వం పాలన చూసే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మాకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ప్రజల కోసం పనిచేశాం. అందుకు బదులుగా ఓటర్లు మమ్మల్ని మరోసారి ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం. అది కూడా ఏకగ్రీవంగానే. ఈ విషయంలో మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మా ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మావైపే ఉంటారన్న నమ్మకం ఉంది’ అని కవిత వ్యాఖ్యానించారు.