తెలంగాణ‌పై ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న స‌ర్వే రిపోర్టు

247

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు వ‌చ్చాయి అంటే స‌ర్వేల పేరు ముందు వినిపిస్తుంది ..సర్వేల పేరు వినిపించింది అంటే ఫ‌స్ట్ వినిపించే పేరు సర్వే ఆక్టోప‌స్ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.. అయితే తెలంగాణ‌లో ఇప్పుడు జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు అత్య‌ధిక స్ధానాలు గెలిచి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తారు అనేదానిపై ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ జోస్యం చెప్పారు.

Related image

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారని చెప్పారు. రెబెల్స్‌గా బరిలోకి దిగిన వీరు సుమారు 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తారని అన్నారు. తిరుమల వచ్చిన సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్ర‌జ‌లు అంద‌రూ ఈ స‌ర్వే కోసం చూస్తున్నారు. కాని తన సర్వే ఫలితాలను డిసెంబర్‌ 7న వెల్లడిస్తానని తెలిపారు. అంతకుముందే తెలంగాణలో గెలవబోయే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను రోజుకు రెండు చొప్పున చెబుతానన్నారు.

Image result for lagada party

మహబూబ్‌నగర్‌ జిల్లాలో నారాయణపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి శివకుమార్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ బోథ్‌ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి జాదవ్‌ అనిల్‌ కుమార్‌ గెలవబోతున్నారని తెలిపారు. ఇక స్వ‌తంత్ర్య అభ్య‌ర్దుల గెలుపు అనేస‌రికి వారిలో నూత‌న ఉత్తేజం పెరిగిపోయింది.