ఏపీలో రాజ‌కీయ పార్టీల‌కు దిమ్మ‌తిరిగే స‌ర్వే విడుద‌ల ఆశ్చ‌ర్య‌పోయిన ల‌గ‌డ‌పాటి

276

ఏపీలో గత నెల 11వ తేదిన ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 23న ఫలితాలు వెలువడనుండడంతో గెలుపోటములపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మునపటిలా కాకుండా ఈ సారి ఎన్నికలు కాస్త రసవత్తరంగా సాగాయి. ఈ సారి ఎన్నికలలో మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నా వైసీపీ, టీడీపీ మద్యనే తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఇరు పార్టీలు ఇప్పటికే గెలుపు మాదంటే మాది అని ధీమా వ్యక్థం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే వెలువడిన సర్వేలలో చాలా సర్వేలు వైసీపీది అధికారం అని చెప్పగా, కొన్ని సర్వేలు మాత్రం టీడీపీది అధికారం అని తేల్చి చెప్పాయి.

ఈ క్రింది వీడియో చూడండి

అంతేకాదు చాలా మంది రాజకీయ నిపుణులు, సర్వేలు కూడా వైసీపీదే గెలుపు అని చెబుతుండడంతో వైసీపీ పార్టీ శ్రేణుల్లో గెలుపుపై మరింత విశ్వాసం ఏర్పడింది. అయితే తాజాగా వెలువడిన అనానమస్ సర్వే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ సర్వే ఫలితాలలో ఇప్పుడున్న ప్రధాన పార్టీలలో మూడు పార్టీలు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని తేల్చి చెప్పింది. ఈ సర్వే ప్రకారం కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పింది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేమిటంటే ఈ సర్వే లెక్కల ప్రకారం వైసీపీతో, టీడీపీకి సమానంగా సీట్లు వస్తాయని చెప్పింది.

Image result for ap politics

అయితే వైసీపీ 77స్థానాలను గెలుచుకుంటుందని, టీడీపీ 76 స్థానాలు గెలుచుకుంటుందని, కేవలం ఒక సీటు తేడా తోనే టీడీపీ ఓటమి పాలవ్వబోతుందని చెప్పడం విశేషం. అంతేకాదు జనసేన మాత్రం 22 స్థానాలను గెలుచుకుంటుందని చెప్పింది. ఈ సర్వే చెబుతున్నట్టు వైసీపీ, టీడీపీలకు ఒక్క సీటు మాత్రమే తేడా ఉంటే అప్పుడు జనసేన ప్రభావంతో జనసేన ప్రభావం వీటిపై గట్టిగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటపుడు జనసేన ఏదో ఒక పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే ఈ సర్వే లెక్కలు ఎంతవరకు నిజమవుతాయో అనేది తేలాలంటే మే 23వరకు వేచి ఉండాల్సిందే.