లగడపాటి ఎగ్జిట్ పోల్ విడుదల.. షాకైన కేసీఆర్ కేటీఆర్.. గజ్వేల్ లో కారు బ్రేక్ ఫెయిల్

362

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్‌దే విజయమని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తేల్చిచెప్పారు. ఫ్రంట్‌కు 10 స్థానాలు అటూఇటుగా 65 సీట్లు.. టీఆర్‌ఎస్‌కు 10 స్థానాలు అటూ ఇటుగా 35 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ముందుగా ప్రకటించినట్టుగానే.. పోలింగ్‌ ముగిశాక శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఓటింగ్‌ తీరుపై తన ఆర్‌జీ ఫ్లాష్‌ టీమ్‌ చేసిన సర్వేలో తేలిన అంశాలను తనదైన విశ్లేషణతో వివరించారు. ముందుగా స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందే స్థానాల సంఖ్యను ప్రకటించి.. ఆ తర్వాత పార్టీలవారీగా సీట్ల అంచనాలు వెల్లడించారు. సెప్టెంబరు నుంచి పలుదఫాలుగా సర్వేలు జరిపి ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టు పేర్కొన్నారు. కిందటిసారి తెలంగాణలో 68.5% పోలింగ్‌ జరిగిందని.. ఈసారి అంతకు మించితే ఒకలాగా, తగ్గితే మరొకలాగా ఫలితాలు ఉంటాయని ఆయన రెండురోజుల క్రితమే పేర్కొన్నారు.

Image result for kcr

టీడీపీ, ఇండిపెండెంట్లు, బీజేపీ.. మూడూ కలిపి ఇన్ని స్థానాలు గెలవడం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేకుండా ఈ పార్టీలు గెలవలేవు. టీడీపీ చిన్న పార్టీ. వాళ్లకున్న ఓటు కొద్ది మాత్రమే. కాంగ్రెస్‌ ఓటు వారికి బదిలీ కావడం కష్టమే. అయినా అయిందంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టే. 30 శాతం ఓటు బదిలీ కావడం చాలా కష్టం. 10 శాతం బదిలీ కావడం ఈజీ. కాబట్టి 30 శాతం ఓటు బదిలీ అయి అంతమంది అభ్యర్థులు గెలుస్తున్నారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టే.

Image result for mahakutami

‘80% జిల్లాల్లో కూటమికే ఆధిక్యత వచ్చే చాన్స్‌ ఉంది. ఎన్ని సీట్లు ఆధిక్యత.. ఒకటా రెండా అనేది చూడాలి. మొన్న జరిగిన రేవంత్‌ రెడ్డి ఇన్సిడెంట్‌ (అరెస్టు) ప్రభావం చూపింది. అంతకుముందు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డిపై కేసులు కూడా ప్రభావం చూపాయి. అలాగే శుక్రవారం జరిగిన పరిణామాలు కూడా ఎక్కడికక్కడ ప్రభావం చూపించాయి’’

Image result for kcr

‘‘టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు మారడం పట్ల ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అది చిన్న ఓటు బ్యాంకు కాబట్టి. కానీ, అంతపెద్ద కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు.. ఇప్పటికే స్థానికంగా ఉన్నకాంగ్రెస్‌ నాయకులను అధిగమించి 10 స్థానాల్లో (టీడీపీకి) బదిలీ అయింది. రెండు స్థానాల్లో మాత్రం ఇండిపెండెంట్లకు వెళ్లింది. కూటమి అభ్యర్థులు బాగా లేకపోతే ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలుస్తున్నారు కానీ.. రూలింగ్‌ పార్టీ గెలవట్లేదంటే ఒక అండర్‌కరెంట్‌ ఉన్నట్టు లెక్క. బీజేపీ అభ్యర్థులు ఒంటరిగా పోటీ చేసి గతంలోకంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నారంటే ఏదో అండర్‌కరెంటు ఉన్నట్టే లెక్క.’’

లగడపాటి అంచనా
65 స్థానాల్లో ఫ్రంటే
35 చోట్ల టీఆర్‌ఎస్‌
బీజేపీ, మజ్లిస్‌కు ఏడేసిసీట్లు వ‌స్తాయి
7-8 చోట్ల స్వతంత్రులు గెలుస్తారు

అలాగే త‌న అంచ‌నాల లెక్క‌లు ఇలా కూడా ఉండ‌వ‌చ్చు

ప్రజాఫ్రంట్‌ 65 (+10)
టీఆర్‌ఎస్‌ 35 (+10)
బీజేపీ 07 (+ 2)
మజ్లిస్‌ 06-07
స్వతంత్రులు 07 (+ 2)

మ‌రి చూడాలి డిసెంబ‌ర్ 11న ఫ‌లితాలు ఎలా ఉంటాయో.

ఈ క్రింద వీడియో మీరు చూడండి