టీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడి బరితెగింపు.. మహిళా ఫారెస్ట్ రేంజర్‌పై దాడి

173

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలు వీధి రౌడీల్లా మారుతున్నారు. ప్రభుత్వాధికారుల అన్న విషయాన్ని మర్చిపోయి మరీ రౌడిల్లా వ్యవహరించారు. అధికారం ఉందన్న ఆహాంకారంతో ఆఫీసర్లపైనే గుండాల్లా రెచ్చిపోతున్నారు. తమ పదవులకు గౌరవాన్నిచ్చే ఉద్యోగులంటే ఏమాత్రం గౌరవం లేకుండా వారిని చితకబాదుతున్నారు. అచ్చం అలాంటి సీనే కుమురం భీం జిల్లాలో జరిగింది .

Related image

కొమురంభీం జిల్లా జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల గ్రామంలో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందిపై స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జిల్లా పరిషత్ వైస్‌ఛైర్మన్ కోనేరు కృష్ణ అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సార్సాల గ్రామంలో 20 హెక్టార్లను చదును చేసి మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ రేంజర్ అనిత ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఆదివారం ఉదయం సార్సాల గ్రామానికి చేరుకున్నారు. ఫారెస్ట్ సిబ్బందిని చూడగానే గ్రామస్థులు పెద్దయెత్తున అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఆ స్థలంలో మొక్కలు నాటేందుకు వీల్లేదంటూ హెచ్చరించారు. అదే సందర్భంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు కృష్ణ తన అనుచరులతో ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దాడి చేయొద్దని వేడుకుంటున్న ఫారెస్ రేంజ్ ఆఫీసర్ అనితపై కృష్ణ కర్రతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే ఘర్షన జరుగుతున్న సమయంలో స్థానిక పోలీసులు కూడ ఉన్నారు…అయినా అధికారుపై కర్రలతో దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం కొసమెరుపు. ఈ దాడిలో అనిత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఆందోళనకారుల బారి నుంచి ఆమెను రక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెకు బలమైన గాయం కావడంతో డాక్టర్లు నాలుగు కుట్లు వేశారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు చేతులు విరిగిపోయినట్లు తెలిపారు. ఆస్పత్రిలో అనితను పరామర్శించిన ఉన్నతాధికారులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తనపై ఎమ్మెల్యే తమ్ముడు కృష్ణ కర్రతో దాడికి పాల్పడ్డాడని, గ్రామస్థులను కూడా రెచ్చగొట్టి తమపై దాడి చేసేలా ఉసిగొల్పాడని ఆమె రోదిస్తూ చెప్పడాన్ని పోలీసులు వీడియో రికార్డు చేశారు. జుట్టు ప‌ట్టుకుని త‌న‌పై దాడి చేశార‌ని బాధితురాలు రోధిస్తోంది. అనితపై దాడిని అటవీశాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మరి ఎఫ్ఆర్ఓ మీద ఎమ్మెల్యే తమ్ముడు చేసిన ఈ దాడి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.