క‌ర్నూలుజిల్లాలో టీడీపీకి షాక్ త‌ప్ప‌దా?

435

తెలుగుదేశం పార్టీకి క‌ర్నూలు జిల్లాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం వ‌రిస్తుందా అంటే అంత సుల‌భం కాదు అనేది తెలుస్తోంది.. అందుకే టీజీ భ‌ర‌త్ కూడా, సీఎం చంద్ర‌బాబు క‌ర్నూలు నుంచి పోటీ చేస్తే జిల్లాలో క్లీన్ స్వీప్ చేయ‌వ‌చ్చు అని భావిస్తున్నారు అనేది, ఆయ‌న మాట‌గా జిల్లా టీడీపీ వాణిగా వినిపించారు అని భావిస్తున్నారు జిల్లా నాయ‌కులు.

Image result for bhuma brahmananda reddy shilpa mohan reddyఇక క‌ర్నూలు జిల్లాలో ముఖ్యంగా క‌ర్నూలు తీసుకుంటే భాషా వైసీపీ త‌ర‌పున మ‌రింత యాక్టీవ్ అయ్యారు.. ఎస్వీ వ‌ర్గం టీజీ వ‌ర్గం విభేదాల‌తో త‌మకంటే త‌మ‌కు సీటు అని నాయ‌కులు బీరాలు ప‌లుకుతున్నారు.ఇక నంద్యాల‌లో శిల్పా వ‌ర్గం భూమా వ‌ర్గం మ‌ధ్య మ‌రోసారి ట‌ఫ్ వార్ షురూ అనే చెప్పాలి. అలాగే ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధ‌ర్ కూడా ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక శిల్పా త‌న‌యుడితో కూడా రాజ‌కీయంగా మోహ‌న్ రెడ్డిముందుకు వెళుతున్నారు.

Image result for srisailam budda rajashekar reddy shilpa chakrapani reddy

 

 

ఇటు ఆళ్ల‌గ‌డ్డ‌లో మంత్రి అఖిల వ‌ర్గం ఏవీ సుబ్బారెడ్డి వ‌ర్గం మ‌ధ్య త‌గాదాలు సొంత పార్టీలోనే వేరే కుంప‌టి వ్య‌వ‌హారంగా మారాయి..మూడు సార్లు అమ‌రావ‌తిలో మీటింగ్ పెట్టినా ఇక్క‌డ ప‌రిస్దితిలో మార్పురాలేదు.. ఇక వైసీపీ త‌ర‌పున గుంగుల‌ త‌న‌యుడు బిజేంద్ర రెడ్డి ఇక్క‌డ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు.. టీడీపీ వైసీపీ వార్ ఇక్క‌డ మ‌రింత పెరిగింది అనే చెప్పాలి.Image result for sridevi shyam babu pattikonda

బ‌న‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ప‌రిస్ధితులు టిడిపి చేతులు దాటిపోతోంది. బ‌న‌గాన‌ప‌ల్లి ఎంఎల్ఏ బిసి జ‌నార్ద‌న్ రెడ్డికి ఫిరాయింపు మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు మ‌ధ్య గొడ‌వ‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక శ్రీశైలంలో బుడ్డాకు మాజీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి పొలిటిక‌ల్ వార్ మ‌రింత ఉంటుంది అనేది తెలిసిందే. ఇక ప్రత్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో చెరుకుల‌పాడు శ్రీదేవి అలాగే కేఈ కుమారుడు శ్యాంబాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌నున్నారు.. దీంతో వీరి మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ఎలా ఉంటుంది అనేది ఇక్క‌డ సెగ్మెంట్లో అంద‌రూ ఎదురుచూస్తున్నఅంశం.. మొత్తానికి జిల్లాలో అంత సుల‌భంగా టీడీపీకి విజయం వ‌స్తుంది అంటే న‌మ్మ‌సఖ్యం కాదు ఎవ‌రికైనా…