ఉత్త‌మ్, బాబు, రాహుల్ కు కేటీఆర్ ఒక్క ట్వీట్ తో పంచ్

286

తెలంగాణ ఎన్నికల వేళ ప్ర‌చారం స‌రికొత్తగా జ‌రుగుతోంది. ఒక‌రు విమ‌ర్శ‌లు చేస్తే మ‌రొక‌రు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తున్నారు ఇలా రాజ‌కీయంగా స‌రికొత్త పుంతలు తొక్కుతున్నాయి రాజ‌కీయ ప్ర‌చారాలు. టీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ స్పీడు మ‌రింత పెంచారు.

 

ప్రతిపక్షాలకు తన వాగ్ధాటితో కౌంటర్ ఇవ్వడంలో తండ్రికి దగ్గ తనయుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంటారు. . తన ట్వీట్లతో చురకలంటిచడంలో దిట్ట అనే పేరు ఆయనకు ఉంది. తాజాగా ఖ‌మ్మం నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూట‌మి కోసం ప్ర‌చారం ప్రారంభించారు ఈ స‌మ‌యంలో , టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న ఫొటోను ట్యాగ్ చేస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు కేటీఆర్

 

రాహుల్, చంద్రబాబులు సీట్లలో కూర్చుంటే వెనకే ఉత్తమ్ కుమార్ నిల్చొని ఉన్నారు. ఒకవేళ ప్రజాకూటమికి ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ కూడా ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు కేటీఆర్. ఆత్మగౌరవం, వెన్నెముక లేని తెలంగాణ ‘స్కాంగ్రెస్’ నేతలు సిగ్గుపడాలని విమర్శించారు.ఈ ట్వీట్ ఇప్పుడు అంతకుముందు తెలంగాణలో పొలిటికల్ సీజన్ నడుస్తోందని.. జాతీయస్థాయి నాయకులు చీమల్లా బారులు తీరారని మరో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులన్న ఆయన.. వాళ్లు వచ్చి వెళతారని.. కేసీఆర్ మాత్రం ఇక్కడే ఉంటారని పంచ్ వేశారు. దీంతో ఈ ట్వీట్లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.