అత్తాపూర్ హత్య పై పోలీసుల్ని కేటీఆర్ ఏమ‌న్నారో తెలిస్తే షాక్

416

అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర రమేష్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేశాడు..రమేశ్ పై కత్తితో దాడి చేస్తున్న ఓ దుండగుడిని యువకుడు వెనుక నుంచి బలంగా తన్నడంతో అతను ముందుకు పడిపోయాడు అయినా క‌సితీరా ర‌మేష్ ని చంపారు. ఇది ప్ర‌తీకార హ‌త్య‌గా తేల్చారు పోలీసులు. ఇద్దరు దుండుగులు ఓ వ్యక్తిని నడిరోడ్డుపై దారుణంగా హతమార్చడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొడుకు హత్యకు ప్రతీకారంగా జరిగిన ఈ హత్య నగరవాసుల్ని భయభ్రాంతుల‌కు గురి చేసింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే.. దుండుగులు వెంటాడి వేటాడి యువకుణ్ని హతమార్చారు. కసితీరా నరికి చంపిన తర్వాత విజయగర్వంతో చేతులు పైకేత్తి వికట్టహాసాలు చేశారు.

Image result for attapur murder

ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం అని చూసిన వారు అంద‌రూ అంటున్నారు …పోలీసులు ఉన్నా సొసైటీలో ఇలా హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు అని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు.ఈ ఘటకు కొద్ది రోజుల ముందే ఎర్రగడ్డ ప్రాంతంలో ప్రేమించి పెళ్లాడిన తన కూతురితోపాటు ఆమె భర్తపై మనోహరాచారి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనల పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. నగరంలో జరిగిన ఈ రెండు హింసాత్మక ఘటనలపై నెటిజన్ల నుంచి కామెంట్లు, సలహాలు వస్తున్నాయి. ఈ ఘటనలతో నగర ప్రజలు షాకయ్యారు. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, సైబరాబాద్ సీపీ, రాచకొండ పోలీసులు పరిస్థితిని సమీక్షించాలి.

Image result for attapur murder

క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసులకు ఆయుధాలు అందించాలి. వెంటనే అప్రమత్తమై, స్పందించేలా వారికి తగిన శిక్షణ అందించాలని మంత్రి ట్వీట్ చేశారు.అయితే ఆ చనిపోయిన వ్యక్తి తప్పించుకోవాలని చాలా ట్రై చేశాడు కానీ ఆ ఇద్దరు వ్యక్తులు వెనుకనుంచి దాడి చేశారు.వెనుక నుంచి గొడ్డలితో నరికారు కాబట్టి ఆ వ్యక్తి తప్పించుకోలేకపోయాడని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.అయితే ఈ హత్య జరగడానికి ముఖ్య కారణం పగ అని తెలుస్తుంది.గతంలో మహేష్ అనే యువకుడిని ఇప్పుడు చనిపోయిన రమేష్ చంపాడు.మహేష్ గౌడ్ జుమ్మెరా బాద్ లో కిరాణాషాప్ నడుపుకుంటూ ఉండేవాడు.అక్కడే ఉంటున్న రమేష్ కు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.అయితే ఈ విషయం పసిగట్టిన మహేష్ ఆ మహిళను వేదించసాగాడంట.ఈ విషయాన్నీ ఆ మహిళా రమేష్ దృష్టికి తీసుకెళ్లింది.ఆ మహిళను వేధించడం ఆపేయాలని మహేష్ కు రమేష్ చాలాసార్లు చెప్పాడు.

అయినా ఎలాంటి లాభం లేకుండా పోయింది.అయితే ఏడాది క్రితం పార్టీ చేసుకుందాం రమ్మని చెప్పి మహేష్ ను రమేష్ శంషాబాద్ వరకు కారులో తీసుకెళ్లాడు.ఇక తర్వాత స్నేహితులను వెంట రమ్మని చెప్పి అతనిని చంపడానికి ప్లాన్ వేశాడు.శంషాబాద్ వెళ్లిన తర్వాత రమేష్ తన ప్లాన్ ను అమలు చేశాడు.అక్కడే స్నేహితుల సాయంతో అతికిరాతకంగా గొంతు కోసి చంపేశాడు.ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఎవరు గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి దహనం చేశాడు.ఈ ఘటన మీద విచారణ జరిపిన పోలీసులు రమేష్ ను నిందితుడిగా చేర్చారు.ఆ కేసు ఏడాదిగా నడుస్తూనే ఉంది.అప్పటినుంచి కోర్ట్ కు వెళ్ళివస్తూనే ఉన్నాడు.ఈరోజు కూడా ఆ కేసు విషయం మీదనే కోర్ట్ కు వెళ్లి తిరిగివస్తున్నాడు రమేష్. ఇలా ప్ర‌తీకార హ‌త్య‌ల‌కు, ప‌రువు హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం పై మీ ఖండ‌న‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.