సైకిల్ ఎక్క‌నున్న ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌లు

575

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీల్లో ఏదో ఓ పార్టీల్లో చేరాలి అని అనుకుంటున్నారు కాంగ్రెస్ నాయ‌కులు ముఖ్యంగా అధికార పార్టీలో చేరితే ప‌ద‌వులు వ‌స్తాయి అని వారి ఆలోచన అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ వైపు వారికి మార్గాలు కూడా అంత సులువుగా లేవు అందుకే వైసీపీ త‌ర‌పున వారు పోటీ చేయాలి అని భావించినా వారికి టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ కూడా పార్టీ త‌ర‌పున లేదు దీంతో తెలుగుదేశం త‌ర‌పున వెల్లాలి అని భావిస్తున్నారు.

Image result for ugra narasimha reddy

ఈ వ‌రుస‌లో తాజాగా మ‌రో ఇద్ద‌రు నేత‌లు చేరారు.. ప్ర‌కాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలు టీడీపీలో చేరాలని భావిస్తున్నారు..కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.. కనిగిరిలో కీలక నేతగా పేరొందిన ఆయన టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది..ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి కోండ్రు మురళి కూడా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Image result for కోండ్రు మురళి

ఈ మేరకు ఇప్పటికే ఆయన మంత్రి కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు. దీంతో రాజాం నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. వీరిద్దరు మాత్రమే కాకుండా ప‌లువురు నేత‌లు కాంగ్రెస్ నుంచి టీడీపీ పంచ‌న చేరాలి అని చూస్తున్నారు.. దీనికి కార‌ణం కూడా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటుంది అని అనుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ కు కొన్ని సీట్లు ఇచ్చే అవ‌కాశం ఉంది. అందుకే కాంగ్రెస్ త‌ర‌పున గెలుపు కాక‌పోయినా పొత్తుతో అయినా గెల‌వాలి అని భావిస్తున్నారు నాయ‌కులు. అందుకే కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరాలి అని టికెట్లు పొందాలి అని చూస్తున్నారు.