కాంగ్రెస్ గూటికి కొండా దంప‌తులు

318

టీఆర్ ఎస్ పార్టీ త‌మ‌ని న‌మ్మించి మోసం చేసింది అంటున్నారు కొండా దంప‌తులు.. త‌మ‌కు టికెట్ ఇవ్వ‌కుండా స‌స్పెన్స్ లో పెట్ట‌డం పై కొండా సురేఖ ఫ్యామిలీ ఆలోచ‌న‌లో ఉన్నారు.. ఇక టీఆర్ ఎస్ పార్టీలో వారు కొనసాగుతారా లేదా అనేది ఇప్పుడు డైల‌మాగా ఉంది. త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై హన్మకొండ రామ్‌నగర్‌లో కొండా సురేఖ, కొండా మురళీ దంపతులు తమ అనుచరులతో సమావేశమయ్యారు.

Image result for KONDA SUREKHA

టీఆర్‌ఎస్‌ తమకు టికెట్‌ ఇవ్వకుండా సస్పెన్స్‌కు గురిచేయడం.. త‌ర్వాత జ‌రిగిన పరిణామాలను కొండా సురేఖ దంపతులు తమ కార్యకర్తలకు వివరించారు. దీంతో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి.. బయటకు రావాలని కార్యకర్తలకు వారికి సూచించారు. అయితే, ఈ నెల 23వ తేదీ వరకు వేచి చూద్దామని, అప్పటికీ టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం నుంచి స్పందన రాకపోతే.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కొండా దంపతులు తమ అనుచరులకు స్పష్టం చేశారు.

Image result for KONDA SUREKHA congress

టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం తీరుపై ఇప్పటికే కొండా సురేఖ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ‌లో మూడు టిక్కెట్లు ఆ కుటుంబం అడిగింది అని, అందుకే కేసీఆర్ టికెట్ ఇవ్వ‌లేదు అని అన్నారు ఇక ఇప్పుడు త‌మకు టికెట్ రాకుండా కేటీఆర్ అడ్డు త‌గుతులున్నారు అని చెబుతున్న కొండా సురేఖ, త‌న కోట‌రిని సిద్దంచేసుకుంటున్నారు అని కేటీఆర్ పై కూడా ఫైర్ అయ్యారు. ఇక ఆఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.