కోడెల అంత్యక్రియలు ఎక్కడో తెలుసా అక్కడ చెయ్యడానికి కారణం

219

నవ్యాంధ్ర తొలి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణం వెనక రాజకీయకక్షలు ఉన్నాయన్నది టీడీపీ వర్గాల వాదన. మానసిక వేదన భరించలేక ఆయన సూసైడ్ చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోడెల ఆత్మహత్యపై టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. ఇంతకీ కోడెలది ఎలాంటి మరణం అన్నది పోలీసులు ఇవాళ స్పష్టం చేయనున్నారు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం… కోడెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇంట్లో టిఫిన్ చేసి… 10.10కి బెడ్‌రూంకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు.

కోడెల మరణంపై నేడు రిపోర్ట్... సాయంత్రం నరసారావుపేటకు పార్థివదేహం

ఆ సమయంలో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు సహా ఏడుగురు ఉన్నారు. 10.40కి ఆయన్ని బసవతారకం కాన్సర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పల్స్ పడిపోయినా (దాదాపు మరణమే)… డాక్టర్లు మరో 40 నిమిషాలపాటూ… బతికించేందుకు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రాథమికంగా తేల్చినది ఇదే. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇవాళ పోలీసులకు అందుతుంది. అందులో అది సూసైడా కాదా అన్నది తేలే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం కోడెల మరణంపై రాజకీయాలు చేయొద్దనీ, తమను మరింత కుంగదీయొద్దనీ వేడుకుంటూ కన్నీటి సంద్రమయ్యారు.

ఈ క్రింద వీడియో చూడండి

పోస్ట్ మార్టం తర్వాత పార్థివ దేహాన్ని కోడెల ఇంటికి తరలించారు. ఆ తర్వాత ప్రజల సందర్శన కోసం ఎన్టీఆర్ భవనానికి తరలించారు. ఇవాళ కోడెల పార్థివదేహాన్ని ఇవాళ గుంటూరు జిల్లాలోని నరసారావు పేటకు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రానికి పార్థివ దేహం నర్సారావుపేటలోని కోడెల స్వగృహానికి చేరనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఇవాళ టీడీపీ ఏపీ వ్యాప్తంగా సంతాప సభలు నిర్వహించనుంది.