చంద్రబాబుతో కోడెల చివరి సారిగా ఏమన్నారంటే

470

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హఠాన్మరణంతో టీడీపీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఐతే… టీడీపీలో మరే నేతపై లేనంతగా… అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచీ కోడెల ఫ్యామిలీపై రకరకాల కేసులు నమోదవుతూ వచ్చాయి. పరిస్థితి రాన్రానూ తీవ్రం కావడంతో… కోడెలపై పార్టీ అధినేత చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదన్న ఒత్తిడి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు… తన అభిప్రాయాన్ని బయటపెట్టక తప్పలేదు. తప్పు జరిగితే చట్టపరమైన యాక్షన్ తీసుకుంటే, తమ పార్టీ అడ్డుచెప్పదని చంద్రబాబు స్పష్టంచేశారు. కానీ, ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడకూడదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కోడెలను సమర్థించారా, వ్యతిరేకించారా అన్న సందేహాలు తలెత్తాయి.

ఈ క్రింద వీడియో చూడండి

నిజానికి కోడెల శివప్రసాదరావు విషయంలో చంద్రబాబు చాలా అంశాల్లో రాజీ పడిపోయారనీ, అందువల్లే కోడెల ఫ్యామిలీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి నేత విషయంలో క్రమశిక్షణ పాటించాలని పదే పదే చెప్పే చంద్రబాబు… కోడెల తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల విషయంలో మాత్రం లైట్ తీసుకున్నారనీ… దాని ఫలితంగా ఎన్నికల తర్వాత… కోడెలతోపాటూ… టీడీపీకి కూడా అదో శాపంలా మారిందనే విమర్శలున్నాయి. ఎన్నికల్లో కనీసం కోడెలకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా వేరే ఎవరికైనా ఇచ్చి ఉంటే… కనీసం చంద్రబాబుపై ప్రజలు పాజిటివ్‌గా ఉండేవాళ్లనీ, కానీ అవినీతికి పరోక్ష సహకారం అందిస్తూ… మళ్లీ కోడెలకు చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో… ప్రజలు కోడెలతోపాటూ… చంద్రబాబుపైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.