గన్ మెన్ బయటపెట్టిన షాకింగ్ నిజాలు

1781

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.. ఆయ‌న మ‌ర‌ణంతో తెలుగుదేశం పార్టీలో విషాద చాయ‌లు అలుముకొన్నాయి… బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం తర్వాత కోడెల మృతదేహాన్ని సాయంత్రం 6 గంటల సమయంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు తరలించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు నివాళి అర్పించేందుకు వీలుగా కోడెల పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం 8 గంటల వరకూ అక్కడే ఉంచారు. ఇక సొంత ప్రాంతం గుంటూరు జిల్లా నరసరావుపేటకు ఆయ‌న భౌతికకాయం త‌ర‌లించారు.. ఆయ‌న చివ‌రి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున ఆయ‌న అభిమానులు నేటి సాయంత్రం తరలిరానున్నారు. బుధవారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఆయ‌న ఆత్మ‌హ‌త్య త‌ర్వాత తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది క‌క్ష పూరితంగా ప్ర‌భుత్వం వేధించ‌డం వల్ల జ‌రిగిన ఆత్మ‌హ‌త్య అని ఆరోపించింది.

Related image

ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారని.. డాక్టర్లు.. ప్రాథమికంగా తేల్చినా.. కోడెల మృతిపై మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలను గన్‌మెన్‌, హోంగార్డులే ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గన్‌మెన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఉదయం 9.30 సయంలో.. కోడెల సార్.. ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లడాన్ని నేను చూశానని.. ఆ తరువాత విజయలక్ష్మీ మేడమ్.. 11 గంటలకు పైకి వెళ్లి ఎంత కొట్టినా.. సార్ తలుపులు తీయకపోయేసరికి.. గట్టిగా అరిచారని అన్నారు. దీంతో.. మేము వెళ్లి.. పిలిచినా.. తలుపులు తీయకపోవడంతో.. కిటికీ గేట్ నుంచి లోపలికి వెళ్లినట్టు తెలిపాడు. లోపలికి వెళ్లగానే.. నైలాన్‌ తాడకు సార్ వేలాడుతూ.. కనిపించారని.. అది చూసి మేమందరం షాక్‌కి గురై.. వెంటనే ఆస్పత్రికి తరలించామని.. గన్‌మెన్ చెప్పాడు.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే అంత‌కు ముందు జ‌రిగింది కూడా తెలియ‌చేశారు కుటుంబ స‌భ్యులు…కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తన భార్యతో కలిసి టిఫిన్‌ చేశారు. 10.10 గంటల సమయంలో మొదటి అంతస్తులో ఉన్న తన గదికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో కోడెల భార్య, కుమార్తె ఉన్నారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో కొబ్బరి నీళ్లు ఇచ్చేందుకు కోడెల గదికి డ్రైవర్‌ ప్రసాద్‌ వెళ్లారు. ఎంత పిలిచినా ఆయన తలుపులు తెరవకపోవడంతో కోడెల కుమార్తె విజయలక్ష్మిని పిలిచారు. అప్పటికే ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆమె వచ్చి పిలిచిన తర్వాత కూడా తలుపు తెరవలేదు. దాంతో, అనుమానం వచ్చి కిటికీలోంచి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే డ్రైవర్‌ ప్రసాద్‌ కిటికీ తలుపు పగులగొట్టి.. లోపలికి వెళ్లి డోర్‌ తీశారు. అదే సమయంలో గన్‌మన్‌ అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి ఆయనను కిందకు దించారు. హుటాహుటిన, బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం కోడెల మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా గ‌న్ మెన్ చెప్పిన విష‌యం, కుటుంబ స‌భ్యులు చెప్పిన ప్రాధ‌మిక స‌మాచారం వాంగ్మూలంగా తీసుకున్నారు పోలీసులు.