కుమారుడితో రాత్రి కోడెలకు గొడవ రాత్రి ఏమైందంటే

1653

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఊహించని విధంగా ముగిసింది. వైద్యుడిగానే కాకుండా రాజీకయంగానూ ప్రజానాడి తెలిసిన వ్యక్తి. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో తొలి సారి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉంటూనే డాక్టర్ గా కొనసాగారు. టీడీపీలో కీలక నేతగా ఉంటూ అనేక శాఖలకు మంత్రిగా ఎన్టీఆర్..చంద్రబాబు కేబినెట్ లో పని చేసారు. తన కుమారుడు సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత ఆయన నైతికంగా దెబ్బ తిన్నారు.

Kodela suicide beacme shock for TDP..40 Years he worked for party

ఇక, 2019 ఎన్నికల్లో సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటికే కోడెల కుటుంబ సభ్యులు కె టాక్స్ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇక ప్రభుత్వం మారిన తరువాత అనేక కేసులు కోడెల కుటుంబ సభ్యుల మీద నమోదయ్యాయి. అసెంబ్లీ ఫర్నీచర్ సైతం కోడెల కుమారుడి షోరూంలో అసెంబ్లీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూసి తల ఒంపులకు గురైన కోడెల దీని పైన కుమారుడితో చర్చించగా..అది వాగ్వాదానికి కారణమై..మనస్థాపానికి గురైన కోడెల హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Image result for kodela siva prasad

వైద్యుడిగా వచ్చి..నాయకుడిగా ఎదిగి.. 1947 మే 2 న జన్మించిన కోడెల శివ ప్రసాద్ తన కుటుంబంలో మశూచి కారణంగా జరిగిన మరణాలతో ఎలాగైనా వైద్యుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనుగునంగానే గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీయస్ పూర్తి చేసిన కోడెల ఆ తరువాత ఎం ఎస్ పూర్తి చేసారు. నర్సరావు పేటలో మంచి డాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వైద్యుడిగా ఉన్న సమయంలోనే 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. వైద్యుడిగా ఉంటూనే 1983లో నర్సరావుపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంటనే ఎన్టీఆర్ ఆయనకు హోం మంత్రిగా నియమించారు. ఇక, గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ కోసం..కార్యకర్తల కోసం తీవ్రంగా శ్రమించారు. పల్నాటి పులిగా కొందరు..డాక్టర్ గా మరి కొందరు ఆయన్ను ఆప్యాయంగా పిలుచుకుంటారు. 1983, 85, 89, 1994, 2014లో నరసరావుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1996-97 భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రిగా, 197-99 మధ్యలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రిగా కోడెల పనిచేశారు. పార్టీలో చంద్రబాబుకు అతి దగ్గరగా ఉన్న నేత కోడెల. అటువంటి వ్యక్తి రెండు సార్లు వరుసగా నర్సరావుపేట నుండి ఓడిపోయారు. ఆ తరువాత 2014లో సత్తెనపల్లి నుండి గెలిచి రాష్ట్ర విభజన తరువాత ఏపీకి తొలి స్పీకర్ గా పని చేసారు. తాజాగా 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన అదే సత్తెనపల్లి నుండి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి అనేక ఆరోపణలు మొదలయ్యాయి.

ఈ క్రింద వీడియో చూడండి

కోడెల శివ ప్రసాద్ కు ఇద్దరు కుమారులు..ఒక కుమార్తె. ఆయన కుమారుల్లో ఒకరైన డాక్టర్ సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో కోడెల కుంగి పోయారు. దాని నుండి నెమ్మదిగా తేరుకుంటూ రాజకీయాలు కొనసాగించారు. మరో కుమారుడు శివరామక్రిష్ణ కోడెలతో పాటుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇక, కోడెల స్పీకర్ గా ఉన్న సమయంలో ఆయన కుమారుడు..కుమార్తె అక్రమంగా వసూళ్లు చేసారని అనేక ఆరోపణలు వచ్చాయి. కోడెల స్పీకర్ గా ఉన్నంత కాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచిపోయింది. ఇక, అధికారం కోల్పోయిన తరువాత అనేక కేసులు కుమారుడు..కుమార్తు మీద నమోదయ్యాయి. కే టాక్స్ పేరుతో అక్రమంగా వసూళ్లు చేసారని..గడ్డి స్కాంకు పాల్పడ్డారని..అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి. ఇక, కోడెల అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో ఫర్నీచర్ తరలించారనే అభియోగంతో అసెంబ్లీ అధికారులు ఆయన కుమారుడి షోరూం నుండి సిబ్బంది ఫర్నీచర్ స్వాధీనం చేసుకున్నారు.

Image result for kodela siva prasad

ఆ తరువాతి రోజే కోడెల స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. తన అల్లుడు అస్పత్రిలోనే కోడెలకు చికిత్స అందించారు. కోలుకున్న తరువాత ఆయన ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లారు. అయితే, అక్కడ కుమారుడితో జరుగుతున్న పరిణామాల మీద వాగ్వాదం జరిగిందని..ఫలితంగా మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలతో కోడెల తల ఒంపులకు గురయ్యారని తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇక, సొంత పార్టీ టీడీపీ నుండే ఆయనకు మద్దతు లభించలేదు. దీంతో..మరింత మానసికంగా కుంగిపోయారు. ఎప్పుడూ మనో నిబ్బరంగా కనిపించే కోడెల చివరకు ఆయన జీవితం ఇలా విషాదంతో ముగిసింది.