హ‌రికృష్ణ మ‌ర‌ణ‌వార్త విని కొడాలి నాని ఏం చేశాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

567

నంద‌మూరి వంశంలో నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణవార్త ఆకుటుంబాన్ని ఎంతో విషాదంలో నింపింది.. నాలుగుసంవ‌త్స‌రాలు గ‌డ‌వ‌క ముందే ఇంట్లో పెద్ద కుమారుడు, తండ్రి మ‌ర‌ణించ‌డం, అదే విధంగా మ‌రో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం ఆ ఇంటి మ‌నుషుల‌ను మ‌రింత కుంగ‌దీసింది..ఆప‌ద‌లో ఉంటే ఎవ‌రికి అయినా తోడ్పాటుగా ఉండాలి అని చెప్పే మ‌నిషి హ‌రికృష్ణ‌.. ఆనాడు నంద‌మూరి తార‌క‌రామారావు స్ధాపించిన తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండి, తండ్రితో రాజ‌కీయంగా సాయం చేశారు.. తర్వాత హ‌రికృష్ణ చేతుల్లోకి పార్టీ వ‌స్తుంది అని అంద‌రూ భావించారు, కాని ఆ పార్టీ, ఎన్టీఆర్ అల్లుడు, సీఎం చంద్ర‌బాబు చేతిలోకి వెళ్ల‌డంతో, త‌ర్వాత మంత్రి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా పొలిటి బ్యూరొ మెంబ‌ర్ గా మాత్ర‌మే పార్టీలో ప‌రిమితం అయ్యారు హ‌రికృష్ణ‌.

Image result for kodali nani with ntrఇక తెలుగుదేశం నేత‌లు కూడా ఎన్టీఆర్ త‌ర్వాత హ‌రికృష్ణ సీఎం అవ్వాలి అని కోరుకున్నారు.. కాని ప్ర‌జ‌ల కోరిక తీర‌లేదు. నేడు కారు ప్ర‌మాదంలో అనంత లోకాల‌కు హ‌రికృష్ణ కూడా వెళ్లిపోయారు. ఇక తెలుగుదేశంలో ఆయ‌న ప్రస్ధానం కూడా ఎంతో ఉంది…తండ్రికి చైత‌న్య ర‌థ‌సార‌ధిగా ఉండి ముందుకు న‌డిపి, తండ్రిని సీఎం చేసిన త‌న‌యుడిగా ఆయ‌న‌కు కీర్తి ఉంది.ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియ‌ర్లు జూనియ‌ర్లు ఆయ‌న‌కు అంద‌రూ స‌న్నిహితులు.. ఇటు వ‌ల్ల‌భ‌నేని వంశీ అలాగే కొడాలి నాని హ‌రికృష్ణ‌కు మంచి మిత్రులుగా ఉండేవారు, హ‌రికృష్ణ‌ కొడాలి నానితో త‌మ సొంత‌ బంధువుల క‌న్నా ఎక్కువ‌గా ఉంటారు..

Image result for kodali nani with ntr

హైద‌రాబాద్ వ‌స్తే నాని హ‌రికృష్ణ‌ని క‌లిసి వెళ్లేవారు.. ఇక ఎన్టీఆర్ ఎడ్యుకేష‌న్ కూడా ఇక్క‌డ కొడాలి నాని చూసుకునే వాడు, చిన్న‌త‌నం నుంచి నాని ఎన్టీఆర్ అంత‌ క్లోజ్ గా ఉండ‌టానికి హ‌రికృష్ణే కార‌ణం. ఇక తెలుగుదేశం నుంచి కొడాలి నాని బ‌య‌ట‌కు వెళుతున్న స‌మ‌యంలో, ఎన్టీఆర్ హ‌రికృష్ణ కూడా ఎంతో బాధ‌ప‌డ్డారు.. ఆ స‌మ‌యంలో పార్టీలో కొన్నికార‌ణాల‌తో బ‌య‌ట‌కు వెళ్లారు.. అయినా కొడాలి నాని హ‌రికృష్ణ‌తో అదే ర్యాపో మెయింటైన్ చేశారు. ఇక కొడాలి నాని హ‌రికృష్ణ మ‌ర‌ణ వార్త విని కుప్ప‌కూలిపోయార‌ని తెలుస్తోంది.. సెగ్మెంట్లో పార్టీ బాధ్య‌త‌లు చూస్తూ మీటింగుకు రెడీ అవుతున్న నానికి ఈ విష‌యం తెలియడంతో ఎంతో మ‌ద‌న‌ప‌డ్డారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పార్టీలో ఉన్న స‌మ‌యంలో త‌న‌తో ఎలా ఉన్నారో తాను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాత కూడా అలాగే ఉన్నారు అని కొడాలి నాని అన్నారు. ఓ గొప్ప వ్య‌క్తిని, నా ఇంటి స‌భ్యుడ్ని కోల్పోయాను అని కొడాలి నాని కంట‌త‌డిపెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ కు కూడా కొడాలి నాని అంటే చాలా ఇష్టం అనేది తెలిసిందే… గ‌తంలో కూడా ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఇదే చెప్పాడు..నాని ఏది అడిగితే అది చేయ‌డానికి ముందు ఉంటాను అని అన్నాడు తార‌క్ . ఇప్పుడు కూడా ఎన్టీఆర్ తో త‌న‌కు ఎంతో మంచి రిలేష‌న్ ఉంది అని అన్నారు కొడాలి నాని…. ఇక చివ‌రి చూపులు చూడ‌టానికి నాని అక్క‌డ‌కు వెళుతున్నారు. నంద‌మూరి కుటుంబంలో ఇక ప్ర‌మాదాల‌పై మ‌రింత శ్ర‌ద్ద పెట్టాలి అని చెబుతున్నారు ఇండ‌స్ట్రీ రాజ‌కీయ ప్ర‌ముఖులు. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.