కాంగ్రెస్‌లో చేరిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి

420

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ తన నివాసానికి చేరుకున్నారు.

Image result for kiran kumar reddy

అంతకు ముందే రాహుల్ నివాసానికి కిరణ్‌కుమార్‌రెడ్డి, పల్లంరాజు, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఉమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేరుకున్నారు. రాహుల్ వచ్చిన వెంటనే ఆయనతో కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం పార్టీ కండువా కప్పి కిరణ్‌ను రాహుల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ బలోపాతానికి అంతా కలిసి ముందుకు వెళ్లాలని రాహుల్ పిలుపునిచ్చారు.ఆంద్ర రాష్టంలో గతంలో కాంగ్రెస్ కు ఎలాంటి పలుకుబడి ఉందో మళ్ళి అలాంటి పలుకుబడి రావడానికి ప్రయతించాలని కోరారు.

Image result for kiran kumar reddy

కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరడం వల్ల పార్టీకి కొంత లాభం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కిరణ్‌తో పాటు విభజన సమయంలో కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలలో చేరిన నేతలందరినీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలనే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ ఆదేశాల మేరకు ఏపీ కాంగ్రెస్‌ నేతలు కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీలోకి తీసుకువచ్చే విషయంలో కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు కీలకంగా వ్యవహరించారు.