బిగ్ బ్రేకింగ్ : హుటాహుటిన అభినందన్ ఇంటికి బయలుదేరిన కెసిఆర్

320

పాకిస్థాన్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ సెంట్రల్‌ మెడికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ లో చికిత్స పొందుతున్నారు. త్రివిధ దళ ఉద్యోగులకు ఇక్కడ ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తారు. అభినందన్‌ భారత్‌కు వచ్చిన సమయంలో ఆయన ముఖంపై గాయాలున్నాయి దీంతో ఆయ‌న పై ఎలాంటి దాడి జ‌రిగింది పాక్ ట్రీట్ ఎలా చేసింది ఇలాంటి అనేక విష‌యాల‌ను వారు అడిగి తెలుసుకుంటున్నారు. భారత్‌కు తీసుకొచ్చే క్రమంలో ఇప్పటికే ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. కూలింగ్‌ డౌన్‌ ప్రాసెస్‌ కింద అభినందన్ కు ఆదివారం పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.

Image result for abhinandan

ఇక అభినందన్ ను ఆయన కుటుంబసభ్యులు, ఐఏఎఫ్‌కు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు కలుసుకున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం అభినందన్ ను పరామర్శించారు. దేశం మొత్తం ఆయన చూపిన ధైర్యసాహసాలను కొనియాడిందని, గర్వంగా భావించిందని అభినందన్‌కు తెలిపారు నిర్మలా సీతారామన్‌. ఇక పాక్‌లో ఉన్న 60 గంటలు తాను ఎలా గడిపాననే వివరాలను కేంద్రమంత్రికి వివరించారు అభినందన్‌.అంతకుముందు అభినందన్ ను ఇంటెలిజెన్స్ యూనిట్ విచారించింది. ముందుగా ఆయనకు ఢిల్లీలోని ఆర్.ఆర్. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అభినందన్ శారీరకంగా ఫిట్‌గా ఉన్నారా..? లేదా..? అని పరీక్షించారు. ఆయన దుస్తుల్లో గానీ, శరీర భాగాల్లో గానీ ఏమైనా చిప్‌లు అమర్చారా అనే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి శరీరం మొత్తాన్ని స్కాన్‌ చేశారు ఎటువంటి స్పై బ‌గ్స్ ఆయ‌న శ‌రీరంలో క‌నిపించ‌లేదు. మరోవైపు పాకిస్థాన్‌లో బందీగా ఉన్న సమయంలో వింగ్ కమాండర్ అభినందన్‌ను పాక్ ఆర్మీ మానసికంగా వేధించినట్లు సమాచారం. శారీరకంగా పెద్దగా ఇబ్బంది పెట్టనప్పటికీ, సైకలాజికల్‌గా హింసించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత అధికారులకు అభినందన్ తెలియ‌చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి 

మరోవైపు అభినందన్‌కు శారీరక పరీక్షలతో పాటు సైకలాజికల్ టెస్టులు కూడా నిర్వహించారు. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంది.? పాకిస్థాన్ అధికారులు, అభినందన్‌కు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చారు? ఎలాంటి ఆహార పదార్థాలు అందించారు..? దేశ రహస్యాలను తెలుసుకోవడానికి ఏమైనా మెడిసిన్స్ గానీ, ఇతర పదార్థాలేవైనా ఇచ్చారా..? అనే కోణాల్లో అభినందన్‌ను అధికారులు విచారించనున్నారు.శత్రు దేశానికి వెళ్లి తిరిగొచ్చిన ప్రతి సైనికునికి ఇలాంటి పరీక్షలు సాధారణమే. శారీరక, మానసిక పరీక్షలతో కలిపి 5 పరీక్షలను ప్రతి జవాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటలిజెన్స్ విభాగం సందేహాలన్నీ పూర్తిస్థాయిలో నివృత్తి అయ్యాకే అభినందన్‌ను ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాతే విధుల్లోకి తీసుకుంటారని ఐఏఎఫ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇక అభినంద‌న్ దైర్య సాహసాల‌ను ప్ర‌ధాని మోదీ ,కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌లు రాష్ట్రాల సీఎంలు ముఖ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు స్వాగ‌తం ప‌లికి ట్వీట్లు తెలియచేశారు.. మీ దైర్యం చూసి 130 కోట్ల మంది నిన్ను అభినందిస్తున్నారు అని మోదీ అన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కు అభినంద‌న్ ను ప‌ర్స‌న‌ల్ గా క‌ల‌వాలి అని అనుకున్నార‌ట‌.. త్వ‌ర‌లో ఆయ‌న‌ని ప‌ర్స‌న‌ల్ గా క‌లిసి అభినంద‌న‌లు తెలియ‌చేయ‌నున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.