సినిమా స్టార్ట్ చేసిన కెసిఆర్.. మొదటి దెబ్బ ఆర్కే మీదనే..ఏం చేశాడో తెలిస్తే షాక్..

459

తెలంగాణాలో కెసిఆర్ మళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడు. కొడుకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. కెసిఆర్ దేశ రాజకీయాలలోకి వెళ్లాలని చూస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే కెసిఆర్ ప్రజల పాలన చూడాలి. కానీ దానికన్నా ముందు కొందరి అంతు చూడాలనుకుంటున్నాడు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు తమ గురించి చెడ్డగా చెప్పి తెరాస పార్టీకి అధికారం రాకుండా చెయ్యాలని చూసిన వారి భరతం పట్టాలనుకుంటున్నాడు. అందులో భాగంగా ఏబీఎన్ రాధాకృష్ణ మీద మొదటి వేటు వేశాడు. మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for abn radha krishna

ఎలక్షన్స్ కు ముందు తెరాస పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి సినిమా చూపేందుకు రెడీ అయ్యారు కెసిఆర్ అండ్ టీమ్. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చెప్పినట్టే చంద్రబాబుకు అతని టీమ్ కు చుక్కలు చూపించేందుకు సిద్దమయ్యాడు కెసిఆర్. ముందుగా లగడపాటితో సర్వే చేయించి నాటకం ఆడిన ఆర్కే మీద పడ్డాడు కెసిఆర్. ఏబీఎన్ ఆఫీస్ లో షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఛానెల్ రన్ చేసుకోడానికి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడి అనుమతి ఇచ్చాడు కెసిఆర్.అయితే దానికి కృతజ్ఞత చుపించాల్సింది పోయి కల్వకుంట్ల కుటుంబం మీద వ్యక్తిగత వార్తలను చూపిస్తూ వారి మీద రెచ్చిపోయాడు రాధాకృష్ణ. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు కెసిఆర్. తెలంగాణాలో తెరాస అధికారంలోకి రాగానే అన్ని మీడియా ఛానెల్స్ కెసిఆర్ కు శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా సాక్షిగా అందరూ కంగ్రాట్స్ చెప్పారు. పైగా న్యూస్ ఛానెల్స్ లలో యాడ్స్ కూడా ఇచ్చారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే యాడ్స్ ఇచ్చే న్యూస్ ఛానెల్స్ ల లిస్ట్ నుంచి ఏబీఎన్ ను తీసేశాడు కెసిఆర్. చిన్న చిన్న యాడ్స్ వేసింది కానీ పెద్ద పెద్ద యాడ్స్ ఒక్కటి కూడా ఏబీఎన్ లో పడలేదు. మీడియా ఛానెల్స్ కు న్యూస్ కంటే ప్రకటనల మీదనే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇదిలా ఉంటె రేపు ప్రభుత్వం నుంచి వచ్చే యాడ్స్ కూడా ఆంద్రజ్యోతికి రాకుండా కెసిఆర్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే కనుక జరిగితే ఏబీఎన్ రాధాకృష్ణకు గడ్డురోజులు మొదలయినట్టే. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి ఏబీఎన్ కు యాడ్స్ ఇచ్చి ఆదుకోవచ్చు. ఒకవేళ రేపు ఏపీ ఎన్నికలలో బాబు పదవి పోతే ఇక రాధాకృష్ణకు దిక్కే ఉండదు.అప్పుడు తనకు నచ్చిన వార్తలు రాసుకుంటే వచ్చే కొంత సొమ్ముతోనే ఛానెల్ ను నడిపించాలి. ఇలా జరిగితే ఇక ఆర్కే పని అంతేసంగతి. ఆర్కే చెప్పే పచ్చ వార్తలకు ఇక తెలుగునాట శుభం కార్డు పడ్డట్టే. చూడాలి మరి భవిష్యత్ లో ఏం జరుగుతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఏబీఎన్ రాధాకృష్ణ మీద కెసిఆర్ పగ తీర్చుకుంటున్న విధానం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.