కేటీఆర్ కి కీల‌క బాధ్య‌త‌లు ఇచ్చిన కేసీఆర్

286

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఒక్కో అంశంపై క్లారిటీ వస్తోంది. సీఎంగా రెండోవ‌సారి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కేసీఆర్, తెలంగాణ ప‌రిపాల‌న‌ ప‌గ్గాలు అందుకున్నారు ఈ స‌మ‌యంలో కేటీఆర్ కు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించారు…తెలంగాణ రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావును పార్టీ అధ్యక్షుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నియమించారు. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్ణయంతో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను తూ.చా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్న దృష్ట్యా అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Image result for ktr

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండటంతో తనపై పని భారం పెరుగుతోందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించినట్లుగా తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. ఇక త్వ‌ర‌లో కేటీఆర్ కూడా పార్టీ త‌ర‌పున సీఎం అని తెలుస్తోంది.