చంద్రబాబుకి కేసీఆర్ వార్నింగ్.. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతా కేసీఆర్ సంచలన కామెంట్లు

325

తెలంగాణ‌లో తాజాగా వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో టీఆర్ఎస్ పార్టీ త‌న ప్ర‌భంజ‌నం చూపించింది.. విజ‌య సంకేతాలు చూపించింది, ఇక‌ కారు పార్టీకి బ్రేకులు లేకుండా దూసుకుపోయింది అనే చెప్పాలి. ఈ స‌మ‌యంలో కేసీఆర్ మీడియా ముఖ్యంగా గెలుపు త‌ర్వాత మాట్లాడారు..కులాల‌కు మ‌తాల‌కు అతీతంగా స‌క‌ల జ‌నులు మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించారు.. ఈ విజ‌యానికి కార‌ణం అయిన అంద‌రికి శిర‌సు వంచి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను.. కార్య‌క‌ర్త‌లు అంద‌రూ చాలా క‌ష్ట‌పడ్డారు, రాజకీయాల్లో చాలా కామెంట్లు వ‌స్తాయి అవి అన్నీ ప‌ట్టించుకోవ‌ద్దు.. కోటి ఎక‌రాలు ప‌చ్చ‌ద‌నంగా మారాలి ఈ ఐదు సంవ‌త్స‌రాల‌లో అని కేసీఆర్ అన్నారు. కాళేశ్వ‌రం కావాలా శ‌నీశ్వ‌రం కావాలా అని అడిగాను, ప్ర‌జ‌లు కాళేశ్వ‌రం కావాలి అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ఇక్క‌డ రైతుల‌ని ధ‌నికులుగా మారుస్తాం. కార్మికులు వృత్తుల వారి ఇబ్బందులు తీరుస్తాం.

Image result for kcr and chandrababu

నిరుద్యోగ స‌మ‌స్య దేశంలో చాలా ఉంది. క‌చ్చితంగా మీకు ఉద్యోగ ఖాళీలు భ‌ర్తీ చేస్తాం. విజ‌యం ఎంత ఘ‌నంగా ఉందో బాధ్య‌త కూడా అంతే బరువుగా ఉంది.. వైద్య విధానంలో తెలంగాణ చాలా గొప్ప‌గా మారుతుంది అని ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటాం అని అన్నారు.గిరిజ‌నులు గిరిజ‌నేతుల‌కు భూమి బాధ‌లు లేకుండా చేస్తాం.. వైశ్య రెడ్డి కార్పొరేష‌న్ క‌చ్చితంగా ఏర్పాటు చేస్తాం.. పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా ముందుకు వెళ‌తాం.. తెలంగాణ ఎన్నికల్లో ఉద్యోగులు ఈసీ బాగా ప‌నిచేశారు , స‌మ‌ర్ధ‌వంతంగా ఎన్నిక‌లు నిర్వ‌హించారు ర‌జ‌త్ కుమార్ కి ఎన్నిక‌ల సిబ్బందికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు చెప్పారు కేసీఆర్.. జాతీయ రాజ‌కీయాల‌లో క‌చ్చితంగా కీ రోల్ పోషిస్తాం.. అంద‌రికి ఆరోగ్య భద్ర‌త క‌ల్పిస్తాం. దేశంలో నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పాల‌న వ‌చ్చి తీరాలి.ఈ రోజు తెలంగాణ స్టాండ్ అదే చూపించింది ప్ర‌జా తీర్పుతో అని అన్నారు కేసీఆర్.

దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉంటే, 30 వేల టీఎంసీలు మాత్ర‌మే వాడుతున్నాం. 15 కోట్ల మంది రైతులు ఉన్నారు వారిని అంద‌రికి ఆదుకోవాలి. ప్రైవేట్ రంగంలో పెద్ద‌ ఎత్తున ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తాం అన్నారు కేసీఆర్. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు తెలంగాణ లేజిస్లేచ‌ర్ మీటింగ్ ఏర్పాటు చేస్తామ‌ని అప్పుడు మిగిలిన విష‌యాలు తెలియ‌చేస్తాం అన్నారు. ఇక రేపు క్లారిటీ రానుంది ప్ర‌మాణ స్వీకారం విష‌యం పై. ఇక ఏపీ రాజ‌కీయాల్లో క‌చ్చితంగా తాము వేలు పెడ‌తాం మ‌రి చంద్ర‌బాబు ఇక్క‌డ రాజ‌కీయాల్లో వేలు పెట్టారు క‌దా అని చ‌లోక్తులు విసిరారు. క‌చ్చితంగా చంద్ర‌బాబుకి గిఫ్ట్ ఇస్తాము అని అన్నారు ఆయ‌న‌.నేను బాబుకి గిఫ్ట్ ఇవ్వ‌లేదు అనుకో తెలంగాణ‌కు సంస్కారం లేదు అంటారు చంద్ర‌బాబుకి గిఫ్ట్ ఇస్తాను అని అన్నారు. క‌చ్చితంగా విజ‌యవాడ వెళ్లి బాబు రాజ‌కీయాలు చెబుతాను, కేంద్రం ద‌గ్గ‌ర బాబు రాజ‌కీయాలు అన్నీ నాకు తెలుసు , ఇవ‌న్నీ నా ద‌గ్గ‌ర ఉన్నాయి అని చ‌లోక్తులు విసిరారు. మ‌రి కేసీఆర్ బాబు పై చేసిన కామెంట్ల పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.