రోజా ఇంటికి కేసీఆర్

308

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన పర్యటనలు చేస్తున్నారు. ఆదివారం నాడు ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ సినిమా తీస్తే తాను నిర్మాతగా ఉంటానని కూడా కేసీఆర్ ప్రకటించారు. ఇది అటు సినీ వర్గాలలోను, ఇటు రాజకీయ వర్గాలలోను సంచలనం అయ్యింది. ఈ వార్త మరచిపోకముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇంతకీ అది ఏమిటని అనుకుంటున్నారా… సినీనటి, నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లడమే. సోమవారం నాడు తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కంచి లోని అత్తి వరదరాజ పెరుమాళ్ ను దర్శించుకునేందుకు కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని కూడా కేసీఆర్ దర్శించుకుంటారు.

Image result for రోజా ఇంటికి కేసీఆర్

దీంతో రేణిగుంట వరకూ ప్రత్యేక విమానంలో వెళ్తారు కేసీఆర్. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తమిళనాడు చేరుకుంటారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎంకు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, మిథన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి దర్శనార్థం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నకేసీఆర్ రోడ్డు మార్గాన కంచికి బయలుదేరి వెళ్లారు. కంచికి వెళ్లేదారిలోని నగరిలో ఎమ్మెల్యే రోజా ఇంటికి చేరుకుని తేనీటి విందు స్వీకరిస్తారని ముందు అనుకున్నారు. అయితే సమయాభావం వల్ల షెడ్యూల్‌లో చిన్నపాటి మార్పులు చేశారు. స్వామివారి దర్శనార్థం తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్తారని తెలిసింది. కేసీఆర్ కుటుంబానికి ఎమ్మెల్యే రోజా విందు ఏర్పాటు చేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇందుకోసం ఎమ్మెల్యే రోజా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నగరిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు మంత్రులు స్వాగతం పలకనున్నారు. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ ను కలసిన కేసీఆర్ ఆయన దర్శకత్వం వహిస్తే తాను చిత్రాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో కాని, మరో ప్రాధాన్యం ఉన్న పాత్రలో కాని రోజాను నటించమని కేసీఆర్ అడిగే అవకాశాలు ఉన్నాయా? అని సినీ, రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలకు అన్ని ఏర్పాట్లు చూసుకోమని తెలియచేశారట.. ముఖ్యంగా కేసీఆర్ కు రోజా పై ప్రత్యేకమైన అభిమానం ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆమెని సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన మదనపడ్డారట. ఇలా నాయకులని టార్గెట్ చేయడం మంచిది కాదు అని కొందరు ఏపీ నేతలకు అప్పుడు స్వయంగా తెలియచేశారట. కాని ఇప్పుడు పరిస్దితులు మారిపోయాయి ఆమె వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. మరి ఈ భేటీ వెనుక రీజన్ ఏముంటుంది అని భావిస్తున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.