డెడ్ లైన్ ముగిసింది ఇక తెలంగాణలో ఆర్టీసీ లేదు కేసీఆర్ సంచలన ప్రకటన

578

50 వేల మంది కార్మికులు ఒకవైపు కేసీఆర్ ఒకవైపు ….. ఆర్టీసీ కార్మికుల సమ్మె 33 వ రోజు కొనసాగుతోంది. డెడ్ లైన్లతో మాకు సంబంధం లేదు డిమాండ్లు తీర్చాలి అని పట్టుదలతో ఉన్నారు ఉద్యోగులు. నవంబరు 5 అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలని, లేకపోతే 5100 రూట్లలో ప్రయివేట్ ఆపరేటర్లకు పర్మిట్లు ఇస్తామని శనివారం రాత్రి సీఎం కేసీఆర్ ఆల్టిమేటం జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, కేసీఆర్ డెడ్‌లైన్‌ను ఆర్టీసీ కార్మికులు ఏ మాత్రం పట్టించుకోలేదు. మంగళవారం అర్ధరాత్రితో ఆయన ఇచ్చిన గడువు ముగియగా, కేవలం 360 మంది మాత్రమే విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. వీరిలో బస్‌భవన్‌లోని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ 200 మంది వరకు ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో 62 మంది, హైదరాబాద్‌ జోన్‌లో 31 మంది, ఇతర డిపోల పరిధిలో మిగిలిన వారు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Image result for trs samme

ఎంత మంది చేరారు అనేది అధికారికంగా ప్రకటించలేదు. పూర్తి వివరాలను బుధవారం నాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరింది. సమ్మెపై ప్రభుత్వం గడువు విధించినా విధుల్లో చేరేది లేదంటూ కార్మికులు పలు జిల్లాల్లో ప్రతిజ్ఞలు చేశారు.మరోవైపు, ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ప్రభుత్వం విధించిన గడువు ముగియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు మంగళవారం అత్యవసరంగా సమావేశమైన కార్మిక సంఘాల జేఏసీ, అఖిలపక్షం నేతలు.. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించారు. తాను ఇచ్చిన గడువును కార్మికులు పట్టించుకోకపోవడంతో ఇక తనదైన శైలిలో ముందుకు సాగాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇక ఆర్టీసీ కథ ముగిసినట్లేనని, ఇప్పుడున్న రూపంలో ఇక ఎంతమాత్రం కొనసాగదని, దీనికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్టు అధికార వర్గాలు వివరించాయి.

Image result for trs samme

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు తలొగ్గితే భవిష్యత్తులో వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోన్నట్టు సమాచారం. కాబట్టి, ఏది ఏమైనా కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు భోగట్టా. ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని, కార్మికుల డిమాండ్లకు తలొగ్గే పరిస్థితి కూడా లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే సమ్మెపై నిర్ణయాన్ని న్యాయస్థానాలకు వదిలి వేయాలని, ప్రజా రవాణ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపాయి.

ఈ క్రింద వీడియో చూడండి

న్యాయ వివాదం సుదీర్ఘంగా కొనసాగినా అందుకు సిద్ధపడాలని, అక్కడే అమీ తుమీ తేల్చుకోవాలని కూడా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. ఈ అంశంపై కేసీఆర్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు, సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వీఆర్ఎస్ అమలు చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. మరి ప్రభుత్వం దీనిపై ఈరోజు రాత్రి కీలక ప్రకటన చేస్తుంది అని తెలుస్తోంది.. కార్మికులు మాత్రం తమ డిమాండ్లు అన్నీ నెరవేరిస్తేనే ఉద్యోగంలో చేరుతాము అంటున్నారు, మరి వచ్చేవారం నుంచి రోడ్లపై అన్నీ ప్రైవేట్ బస్సులు తిరుగుతాయి అంటున్నారు ఉన్నతాధికారులు.

ఈ క్రింద వీడియో చూడండి