ముంద‌స్తుకు కేసీఆర్ ముందు

426

మ‌రో ప‌ది నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు అని అనుకుంటున్న త‌రుణంలో ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వాతావ‌ర‌ణం మాత్రం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రెడీ అయింది.. ఇక తెలంగాణ‌లో కూడా ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయి అని అనుకుంటున్నారు అంద‌రూ.. అందుకు అనుగుణంగా తెలంగాణ రాజ‌కీయాలు కూడా మారుతున్నాయి.. ఇప్ప‌టికే టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణుల‌కు సంకేతాలు ఇస్తున్నారు.. మంత్రులు- ఎమ్మెల్యేలు సీనియ‌ర్ల‌తో వ‌రుస మంత‌నాలు కూడా సీనియ‌ర్లు చేస్తున్నారు.

Image result for kcr

ఇక తెలంగాణ‌లో ముంద‌స్తు అనేది అంద‌రికి తెలిసిపోయింది అనే చెప్పాలి.. ఇక కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంత్రి వ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించాలని చూస్తున్నారు.. ఇప్ప‌టికే ఓ డేట్ ని అనుకున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ ఎమ్మెల్యేల‌ను కూడా త‌న క్యాంపు ఆఫీసుకు నేరుగా ఆయ‌న ఫోన్ చేసి పిలిచారు.. దీంతో వారు కూడా ఒకే చెప్పారు.. వారు బీజేపీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి సీఎం ఆఫీసుకు వెళ్లారు.

Image result for kcr

కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, బీజేపీ ముఖ్య నాయకులు, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, అరుణ్‌ జైట్లీలను కలిసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మరుసటి రోజే బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక గులాబీ నాయ‌కుల‌తో కూడా చ‌ర్చ‌లు జ‌రిపి తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ ఎలా పెంచుతారో చూడాలి.. వెయ‌ట్ అండ్ సీలో కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై ముంద‌స్తు ఓట‌మికి తెరాస రెడీ అవుతోంది అని అంటున్నారు.. మ‌రి ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటు వేస్తారు అలాగే ఎవ‌రిని ఇంటికి పంపిస్తారు అనేది చూడాలి.