వార్ వ‌న్ సైడ్ రేవంత్ విష‌యంలో ఎంపీ క‌విత కౌంట‌ర్

329

తెలంగాణ‌లో ఏ చిన్న విషయం జ‌రిగినా ఎవ‌రి ఇంటిపై అధికారులు సోదాలు జ‌రిగినా అన్నింటికి టీఆర్ ఎస్ పార్టీపై అభియోగాలు మోప‌డం స‌రైన ప‌ద్ద‌తి కాదు అని విమ‌ర్శించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ బ‌హిరంగ స‌భ ద్వారా ప్ర‌భంజ‌నం సృష్టిస్తాము అని వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార్ వ‌న్ సైడ్ గా ఉంటుంది అని నిజామాబాద్ ఎంపీ క‌విత తెలియ‌చేశారు. ఇక తెలంగాణ ప్ర‌జలు విప‌రీతంగా చ‌ర్చించుకుంటున్న అంశం కాంగ్రెస్ పార్టీపై వ్య‌తిరేక‌త‌తో పెట్టిన పార్టీ తెలుగుదేశం, కాని ఇప్పుడు అదే పార్టీ కాంగ్రెస్ తో క‌లిసి ప‌నిచేయ‌డం పై ఆమె ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.. ఇవ‌న్నీ తెలంగాణ స‌మాజం చూస్తోంది అని ఆమె చెప్పారు, వీరి పొత్తును ప్ర‌జ‌లు ఎలా తిర‌స్క‌రిస్తారో ఎన్నిక‌ల్లో తేలుతుంది అని అన్నారు.

Image result for revanth reddy

రేవంత్‌రెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులకు టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధం లేదని కవిత అన్నారు… ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కొడంగల్, హైదరాబాద్‌లోని రేవంత్ నివాసాలు, వ్యాపార కార్యాలయాలతో పాటు సన్నిహితుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కవిత స్పష్టం చేశారు. ఏదీ జ‌రిగినా అన్నీ రాష్ట్ర ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోవాలి అని ఆమె హిత‌బోద చేశారు