న‌ర‌సారావుపేట‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

353

గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట‌లో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్దితి నెల‌కొంది… వైసీపీ ఇంచార్జ్ కాసు మ‌హేష్ రెడ్డి ఇంటి ద‌గ్గ‌ర పెద్ద ఎత్తున పోలీసులు మోహ‌రించారు.. ఆయ‌న ఇంటికి ఎవ‌రికి రాకుండా బారీ కేడ్లు పెట్టి రాక‌పోక‌లునిలిపివేశారు.నేడు గురజాలలోని పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ మైనింగ్‌ క్యారింగ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు పార్టీ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Image result for kasu mahesh reddy

వైసీపీ నేత‌ల‌ను ఇలా ప్ర‌భుత్వం అడ్డుకోవ‌డం పై, ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ కూడా ప్ర‌శ్నిస్తోంది. ఈ కుట్ర‌లు దేనికి అని నిల‌దీస్తున్నారు.. అక్క‌డ నిజ‌నిర్ధార‌ణ చేస్తే వాస్త‌వాలు అన్నీ బ‌య‌ట‌కు వస్తాయి అని స‌ర్కారు బ‌య‌ప‌డుతోంది అని వైసీపీ విమ‌ర్శిస్తోంది….క్యారింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలు మాయమవుతాయంటూ కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు….ఇక్క‌డ ప‌ర్య‌ట‌న‌లు చేయ‌కూడ‌దు అని పోలీసులు ఇప్ప‌టికే నోటీసులు పంపారు.. ఇంటి నుంచి నాయ‌కులు వ‌స్తే వారిని అరెస్ట్ చేస్తాము అని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు జిల్లా పోలీసులు.

Image result for kasu mahesh reddy house arrest

ఇప్ప‌టికే గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలకు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు పంపారు…రేపల నివాసరావు, గాంధీతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు… దీంతో వైసీపీ నేత‌లు పెద్ద ఎత్తున నిర‌స‌న తెలపాలి అని భావిస్తున్నారు..