జయలలిత సమాధి పక్కనే కరుణానిధి అంత్యక్రియలు.. ఎందుకో తెలిస్తే షాక్

496

డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) కన్నుమూశారు. కావేరి ఆస్పత్రిలో ఆయన మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.దేశం మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తుంది.ఆయన అత్యక్రియలు మెరీనా బీచ్ లో చెయ్యాలని నిర్ణయించారు.అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరగబోతున్నాయి.అయితే ఇలా ఎందుకు చేస్త్జున్నారా అని అందరు ఆలోచిస్తున్నారు.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

Image result for karunanidhi funeral

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరుగుతున్నాయి.తొలుత అన్నాడీఎంకే ప్రభుత్వం మెరీనా బీచ్‌లో కరుణ అంత్యక్రియలకు అనుమతివ్వలేదు. మాజీ ముఖ్యమంత్రులకు స్థలం కేటాయించలేమని తెలిపింది. గాంధీ మండపం సమీపంలో రెండెకరాల స్థలం ఇచ్చింది. దీంతో డీఎంకే మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా వాద ప్రతివాదనల విన్న అనంతరం కోర్టు కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించాలని, అందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని ఆదేశించిందిదివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రిగా పనిచేసిన జయలలిత సమాధి పక్కనే కరుణానిధిని ఖననం చేయనున్నారు.

Related image

మెరీనా బీచ్‌లో మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలితల సమాధులు ఉన్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కరుణానిధి అంత్యక్రియలు కూడా మెరీనాలో నిర్వహిస్తున్నారు.కరుణ రాజకీయ గురువు, డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై, తన రాజకీయ ప్రత్యర్థి జయలలితల సమాధుల మధ్యలో కరుణానిధి సమాధి ఉండనుంది. డీఎంకే కోర్టుకు అందించిన సమాధి నమూనా ప్రణాళికలో అలాగే ఉంది.ప్రస్తుతం కరుణానిధి అంతిమయాత్ర కొనసాగుతోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కరుణానిధి అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు డెరిక్ ఒబ్రెయిన్ హాజరయ్యారు. డీఎంకే కార్యకర్తలు వంద అడుగులు కరుణానిధి బ్యానర్‌తో అంతిమయాత్రలో పాల్గొన్నారు.మెరీనా బీచ్ కు బారీగా అభిమానులు చేరుకుంటున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కరుణానిధి గురించి ఆయన జీవితం గురించి అలాగే జయలలిత సమాధి పక్కనే కరుణానిధికి అంత్యక్రియలు జరపడం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.