క‌రుణ రాజ‌కీయ కెర‌టం ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్ధానం

358

దేశంలో అత్య‌ధిక కాలం ఎమ్మెల్యేగా చేయడం..ఒక పార్టీకి 50 ఏళ్లు అధ్య‌క్షుడిగా ఉండ‌టం అంటే చాలా పెద్ద విష‌యం.. ఆ ప్ర‌శంస‌నీయ‌మైన ప‌ద‌విని అధిరోహించారు కరుణానిధి.. ఆయ‌న మ‌ర‌ణంతో త‌మిళనాడులో విషాద‌చాయ‌లు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి… దేశంలోనే అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు ఆయ‌న‌… హిందీ భాషపై వ్య‌తిరేక ఉద్యమాన్ని కూడా న‌డిపిన వ్య‌క్తి ఆయ‌న‌…..దక్షిణాదిన సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తొలి వ్యక్తి కరుణానిధి..తమిళ భాషన్నా, సంస్కృతన్నా, సాహిత్యమన్నా కరుణానిధికి ఎంతో అభిమానం. ఉద్య‌మాల నుంచి ఆక‌ర్షితుడై ఆయన 14 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయల్లోకి వచ్చారు.

Image result for karunanidhi

1957 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆయ‌న గెలుస్తూ వచ్చారు అంటే ఆయ‌న పొలిటిక‌ల్ గా ఎంత సీనియ‌ర్ నేతో అర్ధం చేసుకోవ‌చ్చు. మొత్తం 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 13 సార్లు గెలిచారు. 1984 ఎన్నికల్లో మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1969లో తొలిసారి సీఎం పదవిని అలంకరించిన ఆయన.. 2006లో ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యారు.పెరియార్‌ రామస్వామి నాయక్కర్‌ ప్రవచిత ద్రావిడ భావజాలం పట్ల ఆకర్షితులైన కరుణానిధి.. 1944లో ద్రావిడ కళగంలో ప్రవేశించారు.ఆ తరువాత పెరియార్‌తో విభేదించి… 1949లో అన్నాదురై స్థాపించిన డీఎంకేలో పనిచేశారు……తొలిసారి 1957లో కులత్తలై నియోజకవర్గం నుంచి కరుణానిధి గెలుపొందారు.

Image result for karunanidhi
1961లో డీఎంకే కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
1967లో డీఎంకే అధికారంలోకి వచ్చాక ప్రజా పనులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
1969లో అన్నాదురై మృతితో తమిళనాడు సీఎంగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు.
1977లో ఎంజీఆర్‌ సీఎంగా ఎన్నికయ్యాక 13 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నారు….ఎంజీఆర్ మరణించిన త‌ర్వాత 1989లో కరుణానిధి సీఎం పదవి చేపట్టారు.
1971లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
1991లో డీఎంకే ఘోర పరాజయం ఆ స‌మ‌యంలో పార్టీని ఎంతో కాపాడుకున్నారు
1996 ఎన్నికల్లో డీఎంకే అద్భుత విజయంతో మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
2001లో జయలలిత చేతిలో మళ్లీ కరుణానిధి పార్టీ ఓటమిపాలైంది.
2006 మే 13న మరోసారి కరుణానిధి తమిళనాడు అధికార పగ్గాలు చేపట్టారు.
2011లో మళ్లీ అధికారానికి దూరమయ్యారు.

Image result for karunanidhi

ప్రస్తుతం తిరువారూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు… ఈ స్ధానం నుంచి ఆయ‌న త‌ర్వాత ఆయ‌న మ‌న‌వ‌డు స్టాలిన్ కుమారుడు పోటీ చేయాల‌ని ఆయ‌న కోరుకునే వారు.. ఇప్పుడు ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌న‌వ‌డు ఉద‌య‌నిధి స్టాలిన్ పోటీకి నిలిచే అవ‌కాశం ఉంది..ఇటు క‌రుణ పెద్ద కుమారుడు అళ‌గిరి వార‌సులు కూడా ఈ సీటు పై ఆశ‌లు పెట్టుకున్నారు.