జ‌గ‌న్ కి కాపులు పూల దండ‌లు

443

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాపుల రిజ‌ర్వేష‌న్ అంశం పై తాను ఏమీ చేయ‌లేను ఇది కేంద్రం ప‌రిధిలో ఉన్న అంశం అని చెప్ప‌డంతో, కాపులు జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డారు.. ముద్ర‌గ‌డ కూడా ఏకంగా జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల బాణాలు వ‌దిలారు.. ఇక పార్టీలో నాయకులు కూడారివ‌ర్స్ అవ‌డంతో జ‌గ‌న్ ఈ విష‌యంలో మ‌ళ్లీ ఆలోచించారు.. కాపుల రిజ‌ర్వేష‌న్లకు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంది అని తెలియ‌చేశారు.. ఇక త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే కాపుల‌కు ఐదు నుంచి 10 వేల కోట్ల రూపాయలు కార్పొరేష‌న్ కు నిధులు కేటాయిస్తామ‌ని.. తెలుగుదేశం ప్ర‌క‌టించిన ఐదు వేల కంటే మ‌రో ఐదువేల కోట్ల‌ను పెంచారు జ‌గ‌న్.

Image result for jagan padayatra

ఇక దీంతో జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటే, ఇటు కాపులు కూడా జ‌గ‌న్ కు ఫుల్ స‌పోర్ట్ గా మాట్లాడారు.. బీసీల‌కు అన్యాయం జ‌రుగ‌కుండా కాపుల స‌మ‌స్య తీర్చాలి అని అన్నారు… పిఠాపురంలో జగన్‌ను వైసీపీ కాపు నేతలు కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా, పెండెం దొరబాబు, కొప్పన మోహనరావు, పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, అనంత ఉదయభాస్కర్‌, ఎమ్‌.మోహన్‌లు కలిశారు.

Image result for jagan padayatra

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌ట‌న పై కాపులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు అని వారు తెలియ‌చేశారు.. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో కాపు నేత‌లు అంద‌రూ ఆయ‌న్ని సత్కరించారు..జగనన్నా నువ్వు నిజమే చెప్పావ్ అంటూ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన కాపు సేవా సంఘం సభ్యులు గొల్లప్రోలు పట్టణ శివారులో బ్యానర్‌ ప్రదర్శించారు. మొత్తానికి జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న ఓ 24 గంట‌ల పాటు ఏపీలో కాస్త టెన్ష‌న్ పుట్టించినా జ‌గ‌న్ వెంట‌నే న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు.