బీజేపీ ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్న టీడీపీ

408

తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణ‌యాలు పార్టీకి ప్ర‌జ‌ల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నాయో తెలిసిందే.. ఇక వైసీపీ త‌ర‌పున రాజ‌కీయంగా పోరు ఎలా ఉన్నా ఇటు బీజేపీ త‌ర‌పున జ‌న‌సేన త‌ర‌పున హీట్ అలాగే ఉంది.. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి ప్ర‌శ్న‌ల వ‌ర్షం సందిస్తున్నారు. ఎనిమిదో సారి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు చంద్రబాబుకు కన్నా బహిరంగ లేఖను రాశారు.

Image result for bjp kanna lakshmi narayanaఈ నాలుగేళ్లు ప్ర‌జ‌లు మీకు అధికారం ఇచ్చారు కాని మీరు వారికి కావల‌స‌ని స‌దుపాయాలు క‌ల్పించ‌డంలో ఫెయిల్ అయ్యారు.. నాలుగేళ్ల పాల‌న అంతా అవినీతి మ‌యం మీ వైఫ‌ల్యాలు ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు అని క‌న్నా సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌శ్న‌లు సందించారు. ఇక ఇలా ప్ర‌తీవారం క‌న్నా ఐదు ప్ర‌శ్న‌ల‌తో సీఎం చంద్ర‌బాబుకు ఐదు ప్ర‌శ్న‌లు సంధిస్తున్న విష‌యం తెలిసిందే…సీఎంకు ఆయన రాసిన ఎనిమిదో లేఖను విడుదల చేశారు.Image result for chandrababuఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర పథకాలకు మళ్లించలేదా అని మొదటి ప్రశ్నను సంధించారు. ప్రచార పథకాలకు ఇష్టానుసారంగా నిధులు మళ్లించి అన్యాయం చేయడంలేదా అన్ని ప్రశ్నించారు.రాష్ట్రంలోని ఖనిజ సంపద మొత్తాన్ని మీ పార్టీ నాయకులు దోచుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇంత మైనింగ్‌ మాఫియా ఎప్పుడైనా చోటు చేసుకుందా? చివరకు హైకోర్టు చివాట్లు పెట్టే వరకూ స్పందించని మీ దైర్భాగ్య ప్రభుత్వం ఇంకా అధికారంలోకి కొనసాగే హక్కు ఉందా?

మీ పార్టీ కార్యకర్తలకు నామినేషన్‌ పద్దతితో ప్రభుత్వ పనులను ఇచ్చారు. దానిపై సీబీఐ విచారణకు సిద్ధమా?

సీడ్‌ క్యాపిటల్‌ ఏరియాను సింగపూర్‌ కంపెనీలకు అప్పజెప్పడం అంతరార్థం ఏమిటీ? అక్కడ అవినీతి జరగలేదా?

Image result for bjp kanna lakshmi narayana

ఆర్థిక నిర్వహణలో కట్టుదిట్టనని చెప్పుకునే మీరు 10.32శాతం వడ్డీ బాండ్లను ఎందుకు జారీ చేయవలసి వచ్చిందో వివరించగలరా? అని సీఎంను నిలదీశారు.

మ‌రి వీటిపై టీడీపీ ఎటువంటి స‌మాధానాలు చెబుతుందో చూడాలి..