బాబుకి క‌న్నా కొత్త బిరుదు

364

ఏపీలో బీజేపీపై నెగిటీవ్ ప్ర‌చారం చెయ్యాలి అని అనుకున్న తెలుగుదేశం, అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోంది అని ఏపీ బీజేపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు… ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడు చెప్పిన విధంగా ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం అన్నీ ఇస్తేనే ఇలా న‌టుడు శివాజీ కొత్త నాట‌కంతో ముందుకు వ‌చ్చాడు అని అన్నారు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ‌. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌ప్పించుకునేందుకు, బీజేపీ ఏదో వారిపై కుట్ర చేస్తోంది అనేలా ప్ర‌చారం చేస్తున్నారు అని విమ‌ర్శించారు.

Image result for chandrababu
ఈ డ్రామాలు ప్ర‌జ‌లు అంద‌రూ చూస్తున్నారు అని, ఇలాంటివి ఆపేస్తే బెట‌ర్ అని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక అవ‌కాశ‌వాదానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ చంద్ర‌బాబు అని, అలాంటి వ్య‌క్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో క‌లుస్తున్నాడు అంటే ఇంత‌కంటే దారుణం మ‌రోక‌టి ఉండ‌ద‌ని, గ‌తంలో ఇదే కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శించి మాతో ఉన్నాడు, ఇలాంటి అవ‌కాశ‌వాది ని ఎవ‌రూ న‌మ్మ‌రు అని అన్నారు ఆయ‌న‌.

Image result for kanna lakshmi narayana

ప‌చ్చి అబద్దాలు చెప్ప‌డంలో చంద్ర‌బాబుని మించిన వ్య‌క్తి మ‌రొక‌రు ఉండ‌రు అని ఆయ‌న అన్నారు. ఇక టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. ఇలాంటి వారు ఎక్క‌డా ఉండ‌ర‌ని ప్ర‌పంచంలోనే అత్యంత అవినీతిప‌రుడు ఎవ‌రు అంటే చంద్ర‌బాబు అని అంద‌రూ అంటార‌ని అన్నారు… ఆప‌రేష‌న్ గ‌రుడ అనేది వారికి వారు క్రియేట్ చేసుకున్నారు అని, స్వ‌లాభం చూసుకునే వ్య‌క్తి చంద్ర‌బాబు అని క‌న్నా విమ‌ర్శించారు..