బాబు సీమ ప్రేమ‌పై క‌న్నా క‌న్నెర్ర

294

రాయ‌ల‌సీమ‌పై బాబుకు ప్రేమ ఉందా సొంత గ‌డ్డ పై ప్రేమ ఉంటే ఎందుకు ఇక్క‌డ అభివృద్దికి నామాలు పెడుతున్నారు అని, ఇప్పుడు బీజేపీ ప్ర‌శ్నిస్తోంది.గత ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు, సీట్లు రాలేదనే అక్కసుతో సీఎం చంద్రబాబు ఈ ప్రాంతంపై కక్షసాధింపునకు పాల్పడుతున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ స‌మ‌యంలో తాము సీమ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నాము అని చెబుతున్నారు, అలాగే ఇక్క‌డ తాము చేయ‌బోయే అభివృద్ది గురించి ప్ర‌స్తావిస్తే త‌మపై విమ‌ర్శ‌లు కావాల‌నే తెలుగుదేశం చేస్తోంది అని అన్నారు.

Image result for chandra babu

సీమలోని గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను పరిశీలించేందుకు వారానికోసారి కాళ్లకు చక్రాలు కట్టుకుని అక్కడ క్యాట్‌వాక్‌ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీమ ప్రాజెక్టులను విస్మరించడం సరైంది కాదన్నారు. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు పాలకేంద్రం, చిత్తూరు డెయిరీలను తిరిగి తెరిపిస్తామని గత ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ హామీలు చంద్ర‌బాబు గెలిచిన త‌ర్వాత గాలికి వ‌దిలేశారు అని ఆయ‌న విమ‌ర్శించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ తో పొత్తు ఏపీలో కాంగ్రెస్ కు విరోధిగా న‌టిస్తున్న బాబు రాజ‌కీయాలు ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు అని అన్నారు బీజేపీ నేత‌లు.