సీటు ఇచ్చిన పార్టీ ఫేట్ చెప్పిన ఎమ్మెల్యే

408

వైయ‌స్సార్ కాంగ్రెస పార్టీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు క‌దిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా,ఇప్పుడు ఆయ‌న వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించి నేత‌. ఆయ‌న తెలుగుదేశం మెంబ‌ర్. అయితే త‌న‌పై ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేసే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీపై ఈసారి ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపికి పుట్ట‌గ‌తులు ఉండ‌వు అని చెప్పారు. ముఖ్య‌మంత్రి అభివృద్ది చేస్తుంటే వైసీపీ అడుగ‌డుగునా అడ్డుకుంటోంది అని ఆయ‌న విమ‌ర్శించారు.

Image result for kadiri mla chand basha

ప్రజాసంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. పాదయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతులకు రూ. 24 వేల కోట్ల రుణమాఫీ చేశారన్నారు. కాని వైసీపీ దీనిని కూడా రాద్దాంతం చేస్తోంది అని ఆయ‌న విమ‌ర్శించారు. ఇప్పుడు ఇంత ఎగిరిఎగిరి ప‌డుతున్న వైసీపీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చుద్దురు గాని అని ఆయ‌న విమ‌ర్శించారు.

Image result for kadiri mla chand bashaనిత్యం ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న రైతన్నలను ఆదుకోవడానికి వాతావరణ బీమాలో సుమారు రూ. 400 కోట్లు జిల్లాకు విడుదల చేయించారని, కదిరి ప్రాంతానికి రూ. 23 కోట్లు వచ్చిందన్నారు. అభివృద్ది క‌నిపిస్తున్నా లేదు అని చెప్ప‌డంలోనే వారి ఆంత‌ర్యం తెలుస్తోంది అని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక్క‌డ ఇలాంటి విమ‌ర్శ‌లు మాని, వైసీపీ కూడా అధికార పార్టీకి స‌హ‌క‌రించాల‌ని ఇది ప్ర‌జాసంక్షేమానికి మంచిది అని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు.