జగన్ పై మరో భారీ కుట్ర.. శ్రీనివాస్ కి బెయిల్ రద్దు. AP లో ఏం జరుగుతుంది?

139

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన దాడి మరోసారి రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. నిందితుడు శ్రీనివాస్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. దీంతో ఎన్ఐఏ అధికారులు శ్రీనివాస్‌ను మళ్లీ అదుపులోకి తీసుకోనున్నారు.కాగా, గత ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో విశాఖ విమానాశ్రయం లాంజ్‌లో కూర్చొని ఉన్న వైఎస్ జగన్‌పై వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి తీవ్ర గాయమై రక్తస్రావమైంది.

Image result for జగన్ పై మరో భారీ కుట్ర.. శ్రీనివాస్

వెంటనే అప్రమత్తమైన పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని పలుమార్లు విచారించి కోర్టు ఆదేశాల మేరకు జైలు శిక్ష విధించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టులో మే 22న శ్రీనివాస్‌కు బెయిల్‌ను మంజూరు చేసింది.

ఈ క్రింది వీడియో ని చూడండి

తాజాగా, జగన్‌పై దాడి కేసులో శ్రీనివాస్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పిటిషన్ వేసింది. ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు వారి వాదనలతో ఏకీభవించి శ్రీనివాస్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసింది. అంతేకాక బెయిల్ రద్దుపై అప్పీల్ చేసుకోవచ్చంటూ శ్రీనివాస్‌కు హైకోర్టు అవకాశం ఇచ్చింది.

Image result for జగన్ పై మరో భారీ కుట్ర.. శ్రీనివాస్

ఇలా జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ ఆకస్మికంగా జగన్‌పై దాడిచేసిన శ్రీనివాస్‌కు బెయిల్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో వాదనలు వినిపించడం వెనుక అంతుచిక్కని రహస్యమే ఉందంటూ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.