జ‌గ‌న్ కు కౌంట‌ర్ ఇచ్చిన జ‌నసేన

432

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సినిమా ఇండ‌స్ట్రీ నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల కంటే ఇటు రాజకీయంగా విమ‌ర్శ‌లు మ‌రింత పెరిగిపోయాయి.. నిరంతరం తెలుగుదేశం పార్టీ నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉంటాయి.. ఇక జ‌న‌సేనాని పై వైసీపీ కూడా ప‌ర్సెన‌ల్ అటాక్ మొద‌లుపెట్టింది…జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలకు జనసేన కౌంటర్ ఇచ్చింది… జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మాదాసు గంగాధరం మీడియాతో మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

Image may contain: 2 people, people standing and beard

ప‌వ‌న్ నలుగురు పెళ్లాలను మార్చారు …..కార్లు మార్చినట్లు ఐదేళ్లకోసారి భార్యలు మార్చారు..మరొకరినైతే నిత్య పెళ్లికొడుకుగా జైల్లో పెట్టేవాళ్లు అని అన్నారు జ‌గ‌న్ ..బాబు, బీజేపీతో నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు ప‌వ‌న్ అని, ప్ర‌తిప‌క్ష నేత విమ‌ర్శ‌లు….. విలువల గురించి ఆయన మాట్లాడటమా స్పందించాల్సి రావడం ఖర్మ అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.. అయితే జ‌గ‌న్ ఈ కామెంట్లు ఎందుకు చేశారు అంటే అసెంబ్లీ నుంచి జగన్‌ పారిపోయారు అన్న పవన్‌ విమర్శలను ఒక విలేకరి గుర్తు చేసినప్పుడు ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.

Image result for jagan

రాజ‌కీయాల్లో కుటుంబం వ్య‌క్తిత్వం గురించి మాట్లాడ‌టం స‌రికాదు అని అన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మాదాసు గంగాధరం.. ఇక సంస్కారంగా మాట్లాడాల్సిన మాట‌లేనా అని ఆయ‌న విమర్శించారు. మా జ‌న‌సేనాని ఎప్పుడైనా ఎవ‌రిపైన అయిన వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేశారా… జ‌న‌సైనికుల‌కు కూడా ఇదే విష‌యం ఆయ‌న చెబుతారు అని ఆయ‌న అన్నారు.జగన్ ఒక అపరిపక్వమైన రాజకీయ నేత. ఆయనకు పరిపక్వత రావాలని, అసహనం తగ్గాలని, ఆయన నోట మంచి మాటలు రావాలని అందరూ దేవుణ్ని ప్రార్థిద్దాం అని అన్నారు… మొత్తానికి ఇటు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు జ‌న‌సేన కౌంట‌ర్ ఇచ్చింది… మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ కోట‌రీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.