కేసీఆర్ మద్దతు కోరిన నితీష్ కుమార్..!

427

రాజ్యసభ ఉపాధ్యక్షుడి పదవికి ఎన్నిక రేపు జరగనుంది..రాజ్యసభలో ఏ పార్టీ కి గాని కూటమికి గాని తగినంత మెజారిటీ లేనందువలన ఈ ఎన్నిక ప్రాధాన్యతను సంతరించుకుంది..అధికార ఎన్ డి ఎ కూటమి తమ అభ్యర్దిని గెలిపించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది..బిజెపి తమ కూటమి అభ్యర్దిగా జేడియూ కు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ను బరిలోనికి దింపుతున్నారు..

ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జేడియూ అధినేత నితీష్ కుమార్ ఫోన్ చేశారు. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా నితీష్ కు కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. నితీష్ కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే.