ఎమ్మెల్యేపై జేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

399

తెలుగుదేశం పార్టీలో అనంత‌పురం జిల్లాలో వెంట‌నే వినిపించే పేరు జేసి సోద‌రుల‌దే …వారి మాట‌కు తిరుగులేదు అది టీడీపీలోనే కాదు ఏ పార్టీలో అయినా అంతే, అయితే ఇప్పుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో మ‌రింత వైర‌ల్ అవుతున్నారు.. ఇక ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌లు పార్టీకి మ‌రింత చేటు తెస్తున్నాయి.. అలాగే పార్టీలో నాయ‌కుల‌కు హీట్ పుట్టిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే ప్ర‌భాకర్ చౌద‌రి అంటే ముందు నుంచి ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త ఉంది.. ఇక ఆయ‌నకు ప్ర‌భాకర్ చౌద‌రికి మ‌ధ్య విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి.

Image result for jc diwakar reddy

 

అనంత‌పురంలో ఎమ్మెల్యే రోడ్ల వెడ‌ల్పుకి అడ్డుప‌డుతున్నార‌ని, ఆయ‌న పై విమ‌ర్శ‌లు చేశారు ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి.. అలాగే అక్ర‌మాల‌కు అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ గా ఎమ్మెల్యే మారారు అంటూ ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు..మున్సిపల్ భవనాల అద్దె డబ్బు మేయర్‌తో కలిసి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు… అలాగే ఆర్కియాల‌జీకి అప్ప‌గించిన పీస్‌ మెమోరియల్‌ హాల్‌పై ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పెత్తనం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో దౌర్జన్యాలు, రౌడీయిజం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Image result for jc diwakar reddy

ఇప్ప‌టికే కార్పొరేష‌న్లో జ‌రుగుతున్న అవినీతి పై జాయింట్ క‌లెక్ట‌ర్ కు ఈ విష‌యాలు తెలియ‌చేశామ‌ని, అయినా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని, ఈ విష‌యం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద‌కు తీసుకువెళ‌తా అని చెప్పారు ఆయ‌న‌… మొత్తానికి ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం మ‌రింత‌ పెద్ద‌దిగా మారింది.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌భాక‌ర్ చౌద‌రి కూడా కౌంట‌ర్ ఇవ్వాలి అని నిర్ణ‌యించుకున్నారు.. కాని సీఎంకు ఇక్క‌డ పంచాయ‌తీపై ఇప్ప‌టికే న్యూస్ వెళ్ల‌డంతో ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు అని తెలుస్తోంది.